వాష్ | water wash for car | Sakshi
Sakshi News home page

వాష్

Published Tue, Jul 1 2014 12:30 AM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM

వాష్ - Sakshi

వాష్

వాహనాలను శుభ్రపరచాలనుకుంటే వాటర్ సర్వీస్ తప్పనిసరి అనుకుంటాం. అయితే, చుక్కనీరు వాడకుండా.. పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా కార్లను శుభ్రంచేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని సినీమాక్స్ ఫస్ట్‌ఫ్లోర్ కారు పార్కింగ్ దగ్గర ఒక కార్నర్‌లో డ్రైవాష్ ఫర్ యు, ఫర్ ద ప్లానెట్’ అనే బోర్డు కనిపిస్తుంది. అక్కడ మీరు ఈ విశేషం తెలుసుకోవచ్చు.
 ప్రత్యేకత : కార్ల కోసం డ్రైవాష్ సెంటర్ దేశంలో ఇదొక్కటే. దీనికి ఐఎస్‌ఓ: 9001-2008 సర్టిఫికేషన్ కూడా ఉంది. సాధారణంగా ఒక కారు వాషింగ్ కోసం 320 లీటర్ల నీరు వాడాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ చుక్కనీరైనా వాడకుండా, కొన్ని ప్రత్యేకమైన ద్రావకాలు, వాక్స్‌తో కారును ఏ భాగానికి ఆ భాగం శుభ్రపరుస్తారు. కారు సైజు, అందుకునే సర్వీసు బట్టి రూ.300 నుంచి రూ.2000 వరకు ఇక్కడ చార్జి చేస్తారు. కార్లను శుభ్రపరిచేందుకు ఇక్కడ వాడేవన్నీ పర్యావరణానికి ఎలాంటి హాని చేయని ఆర్గానిక్ ఉత్పత్తులేనని, అందువల్ల కారుకు ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు ‘డ్రైవాష్ ఇండియా’ యజమాని సుమంత్ పెరుమాళ్ల.

అరగంట లోపే: అరగంట లోపే ఇక్కడ కారు క్లీనింగ్ పూర్తవుతుంది. సినిమాకు లేదా షాపింగ్‌కి వెళ్లి వచ్చేలోగానే కారు సిద్ధంగా ఉంటుంది. ఎలా క్లీనింగ్ చేస్తారో చూడాలనుకుంటే, అక్కడే సరదాగా మ్యూజిక్ వింటూ చూడొచ్చు. వైఫై సౌకర్యం ఉండటంతో ల్యాప్‌టాప్ ఉంటే హాయిగా ఒకవైపు ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకుంటూనే, మరోవైపు క్లీనింగ్ ప్రక్రియను గమనించవచ్చు. బ్రెజిల్‌లో మొదలైన ఈ ప్రక్రియ కొత్తగా భారత్‌కు వచ్చింది. అమెరికా, కొరియాల్లోనూ కార్ల డ్రైవాషింగ్ ప్రక్రియ బాగానే ప్రాచుర్యం పొందింది. హైదరాబాద్‌లో దీనిపై మరింత అవగాహన పెరగాల్సి ఉందని సమంత్ అన్నారు.      ఎస్‌క్యూబ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement