ఘనంగా‘ సిటీప్లస్’ సక్సెస్ మీట్ | Sakshi city plus success meet | Sakshi
Sakshi News home page

ఘనంగా‘ సిటీప్లస్’ సక్సెస్ మీట్

Published Sun, Oct 19 2014 1:40 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Sakshi city plus success meet

 తరలివచ్చిన ప్రముఖులు
 జ్ఞాపికలు అందజేసిన చైర్‌పర్సన్ భారతీరెడ్డి

 


 
 

సాక్షి, హైదరాబాద్:  సాక్షి ‘సిటీప్లస్’ సక్సెస్‌మీట్ కార్యక్రమం బంజారాహిల్స్‌లోని సాక్షి టవర్స్‌లో  శనివారం ఘనంగా జరిగింది. సిటీప్లస్ తరఫున స్టార్‌రిపోర్టర్లుగా వివిధ రంగాల వారిని పలకరించిన సినీ ప్రముఖులను సాక్షి మీడియా చైర్‌పర్సన్ వై.ఎస్. భారతీరెడ్డి సన్మానించారు. సినీ నటులు జయసుధ, తనికెళ్ల భరణి, సునీల్, పోసాని కృష్ణమురళి, సంగీత దర్శకుడు కోటి, సినీకవి సుద్దాల అశోక్‌తేజ, ప్రజాకవి గోరటి వెంకన్నలకు ఆమె జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. సిటీపాఠకుల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన సిటీప్లస్ విజయం వెనుక అందరి కృషి ఉందన్నారు. సిటీప్లస్ తరఫున రిపోర్టింగ్ నిర్వహించిన సినీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జయసుధ మాట్లాడుతూ తాను రిపోర్టర్ అవతారం ఎత్తి వృద్ధాశ్రమంలో ఉంటున్న పెద్దలను పలకరించడం మరచిపోలేని అనుభూతినిచ్చిందన్నారు. పోస్ట్‌మెన్‌ను ఇంటర్వ్యూ చేసిన జ్ఞాపకాలను తనికెళ్ల భరణి పంచుకున్నారు. ఆటోడ్రైవర్లను ఇంటర్వ్యూ చేసిన పోసాని మాట్లాడుతూ.. ఆటోడ్రైవర్ల సమస్యలను తన రిపోర్టింగ్ ద్వారా బయటకు తెచ్చానన్న సంతృప్తి కలిగిందన్నారు. సుద్దాల అశోక్‌తేజ, సునీల్, గోరటి వెంకన్న స్టార్ రిపోర్టర్‌గా తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్‌తేజ రచనకు కోటి సంగీతం అందించిన ట్రాఫిక్ ఎడ్యుకేషన్ పాట సీడీని ఆవిష్కరించారు. ఈ సీడీని మాజీ డీజీపీ కె. అరవిందరావు విడుదల చేసి తొలికాపీని పంజగుట్ట ట్రాఫిక్ ఏసీపీ పద్మనాభరెడ్డికి అందజేశారు. హీరోలు సాయిశంకర్, సంపూర్ణేశ్ బాబు, దర్శకుడు మారుతి తదితరులు ‘సిటీప్లస్’తో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో సాక్షి మీడియా గ్రూప్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి, మార్కెటింగ్, అండ్ అడ్వర్టయిజింగ్ డెరైక్టర్ కేఆర్ పీ రెడ్డి, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి, సాక్షి ఎడిటర్ వి. మురళి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement