తన బావను విచారణకు పిలుస్తారా.. అంటూ ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో హల్‌చల్ చేశాడు. తన బావను వదలాంటూ బ్లేడుతో చేయి కోసుకోవడంతో పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎండీలైన్స్‌కు చెందిన మహ్మద్ అతీఫ్ చిరువ్యాపారి. ఆదివారం రాత్రి ఆయన భార్య ఇంటి పక్కన ఉండే మరో మహిళ గొడవ పడ్డారు. వీరి ఇంటి పక్కనుండే వ్యక్తి కలగజేసుకుని అతీఫ్ భార్యపై చేయిచేసుకోబోయాడు.
చుట్టుపక్కల వారు వీరికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమనిగింది. అయితే, సోమవారం ఉదయం ఆ వ్యక్తి మళ్లీ అతీఫ్ ఇంటికి వచ్చి హంగామా చేశాడు. ఇదేంటని అతీఫ్‌కు గొడవపడ్డ వ్యక్తిని అడగ్గా అతను అతీఫ్, అతని బావమరిది రషీద్‌పై దాడి చేశాడు. రెండురోజులుగా గొడవ పడుతున్న వ్యక్తి తనను అతీఫ్, రషీద్‌లు కొట్టారని సోమవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం రాత్రి అతీఫ్‌ను స్టేషన్‌కు పిలిపించారు. అదే సమయంలో పోలీస్‌స్టేషన్‌లోకి పరిగెత్తుకొచ్చిన అతీఫ్ బావమరిది రషీద్.. తన బావను వదలకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బ్లేడుతో చేతిపై కోసుకున్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించారు.
బావను వదలాలంటూ యువకుడి హంగామా
Published Tue, Apr 1 2014 9:20 AM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM
Advertisement
Advertisement