రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: అరెస్ట్లు | YSR Congress party state wide protest on ap special status | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: అరెస్ట్లు

Published Tue, Aug 2 2016 11:22 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YSR Congress party state wide protest on ap special status

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్కు పిలుపు నిచ్చింది. ఈ బంద్కు కాంగ్రెస్ పార్టీతోపాటు వామపక్షాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆ పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. దాంతో రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఉన్న పరిస్థితుల వివరాలు ఇలా ఉన్నాయి....

వైఎస్ఆర్ జిల్లా :
కడప ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబుతోపాటు కడప నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. డిపోలోని రెండు గేట్లను మూసివేసి... బస్సులను నిలిపివేశారు.
పులివెందుల బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ సీపీ నేతల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బస్సులను పార్టీ శ్రేణులు నిలిపివేశారు. ఈ ధర్నాలో దేవిరెడ్డి శంకర్రెడ్డి పాల్గొన్నారు.
రైల్వేకోడూరు మండలం కుక్కల్దొడ్డి వద్ద వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చెన్నై - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. బద్వేల్లో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అలాగే స్థానిక బస్టాండ్ వద్ద ప్రజాసంఘాలు ధర్న నిర్వహించాయి. రాయచోటి బంద్‌లో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. స్థానిక నేతలతో కలిసి ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు.
జమ్మలమడుగులో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. వాణిజ్య, వ్యాపార సంస్థల వారు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. బస్సులు నడవటం లేదు. కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో బంద్

కర్నూలు జిల్లా :
కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే గౌరు చరిత, గౌరు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ఆరెస్ట్. ఆలూరులో ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాములు ఆధ్వర్యంలో బంద్

అనంతపురం జిల్లా :
అనంతపురంలో ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డితో సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్కు తరలింపు. పెనుకొండలో శంకర్నారాయణ ఆధ్వర్యంలో బంద్

చిత్తూరు జిల్లా :
నారాయణవనంలో హైవేపై వైఎస్ఆర్ సీపీ సత్యవీడు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. మదనపల్లెలో బాబ్జాన్ ఆధ్వర్యంలో బంద్, అరెస్ట్

నెల్లూరు జిల్లా :
గూడూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద మేరగ మురళీధర్, ఎల్లసిరి గోపాలరెడ్డి ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది.
వాకాడులో ఆర్టీసీ డిపో వద్ద నేదురుమిల్లి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన.
కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్.
ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో బంద్
ఆత్మకూరులో ఎమ్మెల్యే గౌతంరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న బంద్.
సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు
కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్

ప్రకాశం జిల్లా:
గిద్దలూరులో ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. సుమారు 12మంది నేతలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కొండేపిలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో బంద్, పలువురు అరెస్ట్

గుంటూరు జిల్లా :
గుంటూరు జిల్లా మంగళగిరిలో బస్స్టాండ్ వద్ద బంద్ పాటిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఆర్కేతోపాటు తొమ్మిది మంది పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలు ఈ రోజు తెల్లవారుజామున మంగళగిరి బస్సు డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అలాగే బస్టాండ్ వద్ద కూడా ధర్నా చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బంద్కు సహకరించాలని కోరుతూ పట్టణంలో స్థానిక యువకులుబైక్ ర్యాలీ నిర్వహించారు.
సత్తెనపల్లిలో బంద్ పాటించాలని కోరుతూ నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్ సీపీ నేత అంబటి రాంబాబుతోపాటు 20 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరు బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున ఆందోళకు దిగగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
రేపల్లెలో బంద్ పాటిస్తున్న పార్టీ పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌కుమార్, మైనారిటీ నేత షేక్ సుభానీతోపాటు   25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పిడుగురాళ్లలో జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వామపక్షాల ర్యాలీ అరెస్ట్. పెదకూరపాడు నియోజకవర్గంలో కావటి శివనాగమనోహరనాయుడు ఆధ్వర్యంలో బంద్
 

కృష్ణాజిల్లా :
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. నేతలు వంగవీటి రాధ తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్సులు తిరగకుండా అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పార్థసారధి, వంగవీటి రాధ, పి.గౌతంరెడ్డి, నాగిరెడ్డి... ఆర్టీసీ ప్రయాణికులు, పోలీసులు, ఆర్టీసీ సిబ్బందికి గులాబీలు ఇచ్చి బంద్‌కు సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బస్సుల్లో వీరి ప్రచారానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా పార్థసారథితోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

నూజివీడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట నాయకులు బైటాయించారు. దీంతో బస్సులు బయటకు రాలేదు. బంద్‌కు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించాయి. తిరువూరులో కాంగ్రెస్, వామపక్ష నేతలు అరెస్ట్

పశ్చిమగోదావరి జిల్లా :
కొవ్వూరు ఆర్టీసీ డిపో ముట్టడించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత, వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వామపక్షల పార్టీల నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. ద్వారకాతిరుమల బస్టాండ్ వద్ద తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ఆందోళన. పెనమంట్ర మండలం మార్టూరులో పలువురు ఆందోళనకారులు అరెస్ట్

తూర్పు గోదావరి జిల్లా :
రావులపాలెం ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సహా నాయకులు ధర్నాకు దిగారు. బస్సులు బయటకు రాకుండా ఆందోళన చేస్తున్నారు. రంపచోడవరంలో వైఎస్ఆర్ సీపీ నేతల ఆందోళన... పాల్గొన్న ఎమ్మెల్యే వంతుల రాజేశ్వరి, ఉదయభాస్కర్.
ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణ, గుత్తుల సాయి ఆధ్వర్యంలో బంద్.
రామచంద్రాపురంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర ఆధ్వర్యంలో బంద్, ధర్నా

విశాఖపట్నం జిల్లా :
మద్దిలపాలెంలో ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన చేస్తున్న గుడివాడ అమర్నాథ్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌కు సహకరించాలని కోరుతూ తాటిచెట్లపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. కూర్మన్నపాలెంలో దామ సుబ్బారావు, రాజ్కుమార్ ఆధ్వర్యంలో బంద్

పాడేరులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో బంద్. బస్సులను నిలిపేసిన పార్టీ శ్రేణులు, భారీగా మోహరించిన పోలీసులు

అనకాపల్లిలో సీపీఐ నాయకులు అరెస్ట్

కాశింకోట జాతీయరహదారిపై మళ్లా బుల్లిబాబు ఆధ్వర్యంలో రాస్తారోకో

విజయనగరం  జిల్లా :
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన చేస్తున్న పార్టీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామితోపాటు పట్టణ అధ్యక్షుడు వేణు, బంగారు నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా :
పాతపట్నంలో వైఎస్ఆర్ సీపీ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ నాయకుడు తమ్మినేని సీతారంతోపాటు పలువురు పార్టీ నేతలు అరెస్ట్.

రణస్థలంలో గొర్లె కిరణ్కుమార్ ఆధ్వర్యంలో బంద్. ఇచ్చాపురంలో మాజీ ఎమ్మెల్యే పి.సాయిరాజ్ అరెస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement