భవనంలో పేలుడు: 10 మందికి గాయాలు | 10 injured in residential building explosion in China | Sakshi
Sakshi News home page

భవనంలో పేలుడు: 10 మందికి గాయాలు

Published Fri, Jun 12 2015 8:26 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

10 injured in residential building explosion in China

బీజింగ్: చైనా ఈశాన్య ప్రాంతంలో హులుడో నగరంలోని నివాస భవనంలో శుక్రవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. స్థానికుల సహాయంతో పోలీసులు క్షతగాత్రులను నగరంలోని వివిధ  ఆసుపత్రులకు తరలించి... చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ప్రమాదానికి వంట గ్యాస్ లీక్ కారణమని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. గతనెల 31వ తేదీన ఇదే నగరంలో ఇదే తరహా పేలుడు సంభవించి ఇద్దరు మరణించగా... 11 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

Advertisement

పోల్

Advertisement