
బీజింగ్ : చైనాలో ఓ ట్రక్కు భీభత్సం సృష్టించింది. అదుపుతప్పి టోల్‌గేట్ ముందు ఆగి ఉన్న 36 కార్లపైకి దూసుకెళ్లింది. గన్సూ ప్రావిన్స్‌లోని లన్షూ-హైకౌ హైవేపై శనివారం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలోనే 15 మంది మృతి చెందారని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని అధికారులు మీడియాకు తెలిపారు.
ఇక చైనాలో రోడ్డు ప్రమాదాలు తరుచుగా జరుగుతూనే ఉంటాయి. ఇటీవల ఓ బస్సుడ్రైవర్ మహిళా ప్రయాణీకురాలితో గొడవ పడటంతో ఆ బస్సు అదుపుతప్పి లోయలో పడిన విషయం తెలిసిందే. ఈఘటనలో13 మంది మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment