21కి చేరిన డమాస్కస్‌ మృతుల సంఖ్య | 21 Killed in car bomb explosions in syria’s capital Damascus | Sakshi
Sakshi News home page

21కి చేరిన డమాస్కస్‌ మృతుల సంఖ్య

Published Mon, Jul 3 2017 9:29 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

21 Killed in car bomb explosions in syria’s capital  Damascus

డమాస్కస్: సిరియా రాజధాని డమాస్కస్‌లో బాంబు పేలుళ్లతో మృతి చెందినవారి సంఖ్య 21కి చేరింది. నిన్న జరిగిన (ఆదివారం) మూడు కారు బాంబు పేలుళ్లలో 21 మంది మృతి చెందగా మరో40 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, దగ్గర్లో ఉన్న వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ భవంతి కుప్పకూలిపోయింది. చనిపోయిన వారిలో ఏడుగురు భద్రతా సిబ్బంది ఉన్నారు. అయితే దాడికి తామే బాధ్యలమని ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకూ ప్రకటించుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement