పాకిస్థాన్ లో 27 మంది దుర్మరణం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది దుర్మరణం చెందారు. 65 మంది గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్ రెండు బస్సులు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రహీం యార్ ఖాన్ జిల్లాలోని ఖాన్పూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. కరాచీ నుంచి బాహల్పూర్ కు వెళుతున్న బస్సు, ఫైసలాబాద్ నుంచి సాదిఖాబాద్ కు వెళుతున్న పరస్పరం ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
చెల్లాచెదరుగా పడిన మృతదేహాలు, క్షతగాత్రుల ఆక్రందనలతో ఘటనా స్థలంగా బీతావహంగా ఉందని రహీం యార్ ఖాన్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు.