బీభత్సానికి కారణమైన వ్యాను (వృత్తంలో)
బెర్లిన్: జర్మనీలోని మ్యూన్‌స్టర్ నగరంలో శనివారం ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఓ వ్యానుతో కీపెన్‌కెర్ల్ విగ్రహం సమీపంలో ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 30 మంది గాయపడ్డారు. పాదచారుల్ని వ్యానుతో గాయపర్చిన అనంతరం నిందితుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన ఉగ్రదాడా? కాదా? అన్న విషయమై ఇంకా ఎలాంటి స్పష్టతా లేదని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఉగ్రకోణాన్నీ కొట్టిపారేయలేమన్నారు. ప్రమాదస్థలికి రావద్దనీ, ఈ ఘటనపై ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దని పోలీసులు ప్రజలకు ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు. 2016, డిసెంబర్‌లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాది అనీస్ బెర్లిన్‌లో ఓ ట్రక్కుతో పాదచారులపైకి దూసుకెళ్లడంతో 14 మంది దుర్మరణం చెందారు.
Comments
Please login to add a commentAdd a comment