సిరియాలోని అలెప్పో పట్టణంలో భద్రతా దళాలు, అల్ కాయిదా అనుబంధ ఉగ్ర సంస్థల మధ్య జరిగిన భీకర పోరులో 73 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.
బీరట్: సిరియాలోని అలెప్పో పట్టణంలో భద్రతా దళాలు, అల్ కాయిదా అనుబంధ ఉగ్ర సంస్థల మధ్య జరిగిన భీకర పోరులో 73 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆల్ నుస్రా ఫ్రంట్, దానికి మద్దతిచ్చే ఇస్లాం జిహాదీలు 24 గంటల ఘర్షణల తరువాత ఖాన్ తుమాన్, పరిసర గ్రామాలను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నాయని తెలిసింది. కనీసం 43 మంది జిహాదీలు, 30 మంది భద్రతా సిబ్బంది మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
వాయు దాడులకు మేం కారణం కాదు: సిరియా మిలిటరీ
టర్కీ సరిహద్దులో ఆశ్రయం పొందుతున్న 28 మంది పౌరుల మృతికి కారణమైన వాయు దాడుల్లో తమ ప్రమేయం లేదని సిరియా సైన్యం ప్రకటించింది. తిరుగుబాటుదారులు ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది.