ముట్టుకుంటే సూర్యగ్రహణం!
వాషింగ్టన్: సుమారు 38 ఏళ్ల అనంతరం ఈ ఏడాది ఆగస్టు 21న ఖగోళంలో ఓ అద్భుతం చోటుచేసుకోనుంది. చంద్రుడు సూర్యుడికి అడ్డురావడంతో కొన్ని నిమిషాల పాటు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ అద్భుతం కేవలం అమెరికాలో మాత్రమే కనిపించనుంది.
అమెరికాలో చోటుచేసుకోనున్న ఈ అద్భుతాన్ని అందరికీ గుర్తిండిపోయేలా చేయాలన్న తలంపుతో అక్కడి పోస్టల్ ఏజెన్సీ వినూత్నమైన పోస్టల్ స్టాంప్‌ను రూపొందించింది. ఈ స్టాంప్‌పై మొదటిచిత్రంగా 2008లో లిబియాలో చోటుచేసుకున్న సూర్యగ్రహణం బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మను తాకగానే చంద్రుడు పూర్తిగా అడ్డు వచ్చి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ స్టాంప్ అమ్మకాలు జూన్ 20 నుంచి ప్రారంభంకానున్నాయి.