వేలంలో ‘యాపిల్–1’ నిరాశ!
బెర్లిన్: ఆపిల్ సంస్థ తయారు చేసిన అరుదైన మొదటి తరం కంప్యూటర్ ‘యాపిల్–1’కు జర్మనీలో వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో ‘యాపిల్–1’ అనుకున్న దాని కంటే తక్కువ ధరకు అమ్ముడు పోయింది. 1,80,000 – 3,00,000 యూరోలకు అమ్ముడుపోతుందని భావించినప్పటికీ కేవలం లక్షా పదివేల యూరోలకు (దాదాపు రూ.79 లక్షలు) అమ్ముడుపోయింది.
బ్రేకర్స్ సంస్థ నిర్వహించిన ఈ వేలంపాటలో ‘యాపిల్–1’ను జర్మనీకి చెందిన ఓ ఇంజనీర్ దక్కించుకున్నాడు. అయితే ఈ ఆపిల్–1 కంప్యూటర్‌లను యాపిల్ సంస్థ అప్పట్లో 200 మాత్రమే తయారుచేసింది. ఇందులో 1976లో జాన్ జె. డ్రైడెన్ ఒక కంప్యూటర్‌ను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అదే కంప్యూటర్‌కు వేలంపాట నిర్వహించారు.