కొత్త గర్లఫ్రెండ్ తో 66 ఏళ్ల ఆర్నాల్డ్ ష్క్వాజ్ నెగ్గర్ డేటింగ్! | Arnold Schwarzenegger clicked kissing new girlfriend | Sakshi
Sakshi News home page

కొత్త గర్లఫ్రెండ్ తో 66 ఏళ్ల ఆర్నాల్డ్ ష్క్వాజ్ నెగ్గర్ డేటింగ్!

Published Tue, Sep 24 2013 2:56 PM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM

Arnold  Schwarzenegger clicked kissing new girlfriend

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ లో తనకంటూ ఓ ముద్రను వేసుకుని విశేష అభిమానులను సంపాదించుకున్న ఆర్నాల్డ్ ష్క్వాజ్ నెగ్గర్
తాజాగా ఓ గర్లఫ్రెండ్ తో చక్కర్లు కొట్టుతుండటంతో  మరోమారు వార్తల్లో నిలిచాడు. ఓ మహిళను వివాహం చేసుకుని సుదీర్ఘ కాలంపాటు ఆమెతోనే వైవాహిక జీవితాన్ని పంచుకున్న ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగర్ తాజాగా ఓ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చినట్లు వార్తలకు మరింత బలం చేకూర్చుతూ ఓ ముద్దు సన్నివేశం ఒకటి ఓ డాట్.కామ్ లో ప్రత్యక్షమైంది.

 

సెప్టింబర్ 20వ తేదీన లాస్ ఏంజిల్స్ లోని పెయిర్ మోంట్ హోటల్లోని ఫిగ్ రెస్టారెంట్ లో తన గర్లఫ్రెండ్ హీథర్ మిల్లిగన్ తో కలిసి డిన్నర్ చేసిన అనంతరం కారు దిగుతూ ఆమెను ముద్దాడిన ఘటన టీఎమ్ జడ్ .కామ్ లో తారసపడింది.  ఆర్నాల్డ్ ఓ అమ్మాయిని ముద్దాడిన ఈ సన్నివేశం  నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో తాజాగా హీథర్ తో కలిసి ఆర్నాల్డ్ డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు కోడై కూస్తున్నాయి.

 

గతంలో మరియా ష్రివర్ ను పెళ్లి చేసుకుని 25 ఏళ్ల పాటు జీవనయానం కొనసాగించిన ఆర్నాల్డ్ 2011లో ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు. అమెరికాలో ఇన్నేళ్ల పాటు భార్యతో కలిసి జీవించడం గమనించదగ్గ విషయమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement