బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ నూరుల్ హుదా
ఢాకా: బంగ్లాదేశ్‌లో డిసెంబర్ 23వ తేదీన సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. 11వ సాధారణ ఎన్నికలు దేశ వ్యాప్తంగా డిసెంబర్ 23వ తేదీన జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ నూరుల్ హుదా ప్రకటించారు. దేశంలోని మొత్తం 10.42 కోట్ల ఓటర్లు 300 మంది పార్లమెంట్ సభ్యులను ఎన్నుకుంటారు. 100 నియోజకవర్గాల్లో 1.50 లక్షల ఈవీఎంలను వినియోగించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళికలు రూపొందించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. వివిధ అవినీతి ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రతిపక్ష నేత, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) అధినేత్రి ఖలేదా జియా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి జైలుకు వెళ్లిన కొద్దిగంటల్లోపే ఎన్నికల సంఘం ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ ఎన్నికల్లో ఖలేదా పోటీకి దిగే అవకాశాల్లేవని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment