ఒబామా ట్యాంగో డ్యాన్స్‌ అదుర్స్! | Barack Obama dances at state dinner in Argentina | Sakshi
Sakshi News home page

ఒబామా ట్యాంగో డ్యాన్స్‌ అదుర్స్!

Published Thu, Mar 24 2016 3:25 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

ఒబామా ట్యాంగో డ్యాన్స్‌ అదుర్స్!

ఒబామా ట్యాంగో డ్యాన్స్‌ అదుర్స్!

సాధారణంగా అధికారిక వేడుక సాదాసీదాగా చప్పగా సాగుతుంది. కానీ అర్జెంటీనాలో జరిగిన ఓ అధికారిక దౌత్య విందు మాత్రం ఆహూతులను విశేషంగా అలరించింది. అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎందుకంటే సాక్షాత్తూ అగ్రరాజ్యం అధినేత బరాక్ ఒబామా డ్యాన్సర్‌తో కలిసి లయబద్ధంగా నృత్యం చేస్తూ.. అదుర్స్ అనిపించారు.

చక్కని నైపుణ్యమున్న డ్యాన్సర్‌లా ఒబామా ట్యాంగో స్టెప్పులు వేశారు. లేడీ డ్యాన్సర్ మోరా గొడయ్‌తో కలిసి సంగీతానికి తగ్గట్టు లయబద్ధంగా ఒబామా స్టెప్పులు వేశారు. అదేసమయంలో ఒబామా సతీమణి, అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్లీ కూడా ఈ డ్యాన్స్‌లో జతకలిశారు. పురుష డ్యాన్సర్‌ జోస్‌ లాగోన్స్‌తో కలిసి ఆమె కూడా చక్కగా స్టెప్పులు వేశారు. ఒబామా, మిషెల్లీ స్టెప్పులతో ఈ దౌత్యవేడుకలో కొత్త జోష్‌ వచ్చింది.

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అర్జెంటీనా పర్యటనలో ఉన్నారు. బుధవారం బునోస్‌ ఎయిరెస్‌లోని ఓ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన అధికారిక విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా లేడీ డ్యాన్సర్ ట్యాంగో నృత్యం చేస్తూ.. సరదాగా ఒబామా చేయిపట్టి తనతో నృత్యం చేయడానికి ఆహ్వానించారు. మొదట మొహమాట పడినా.. ఆ తర్వాత రిలాక్స్‌డ్‌గా, చాలా ఉత్సాహంగా ఒబామా స్టెప్పులు వేశారు. అటు మిషెల్లీ కూడా తన నాట్యభంగమిలతో సరదాగా గడిపింది.

ఒబామాను పిలిచినప్పుడు తనకు ట్యాంగో డ్యాన్స్ రాదని చెప్పారని, అయితే జస్ట్‌ నన్ను ఫాలో కండి అని  చెప్పానని డ్యాన్సర్ గొడయ్‌ తెలిపింది. 'ఆయన 'ఓకే' అని  డ్యాన్స్‌ ప్రారంభించారు. నిజానికి ఆయన స్టెప్పులకు అనుగుణంగా నేను ఆడాను. ఎందుకంటే ఒబామా చాలామంచి డ్యాన్సర్‌' అని ఆమె తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement