జిరాఫీకి పక్షి డెంటల్ క్లీనింగ్ | bird dental cleaning to ziraffe | Sakshi
Sakshi News home page

జిరాఫీకి పక్షి డెంటల్ క్లీనింగ్

Published Fri, Nov 6 2015 3:20 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

జిరాఫీకి పక్షి డెంటల్ క్లీనింగ్

జిరాఫీకి పక్షి డెంటల్ క్లీనింగ్

జిరాఫీ నోట్లోకి వెళ్లి మరీ ఈ పక్షి ఏం చేస్తోందా అని అనుకుంటున్నారా? డెంటల్ క్లీనింగ్! ఏంటి నమ్మట్లేదా..? కాస్త పరీక్షగా చూడండి..  జిరాఫీ పళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన ఆహార వ్యర్థాలను ఆక్స్‌పెక్కర్ అనే ఈ పక్షి తన ఎర్రటి ముక్కుతో శుభ్రం చేస్తోంది. టాంజానియాలోని ఓ అభయారణ్యంలో ఇలాంటి దృశ్యాలు సాధారణమేనట. రష్యాకు చెందిన యూలియా సుందుకోవా అనే 36 ఏళ్ల ఫొటోగ్రాఫర్ ఈ ఫొటోలు క్లిక్‌మనిపించాడు. ఈ పక్షి తన పళ్లను శుభ్రం చేస్తున్నంతసేపూ జిరాఫీ ఎంతో ఓపికగా ఉందని యూలియా చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement