కంటికి కనపడేదంతా నిజం కాకపోవచ్చు. కొన్నిసార్లు అబద్ధం నిజంలా రంగుపూసుకుని, నిజానికన్నా మరింత అద్భుతంలా కనిపించవచ్చు. అప్పుడు కూడా మనం అందులోని అబద్ధాన్ని కనిపెట్టేప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు మాత్రం అబద్ధమే బాగుందనుకుంటాం. ఈ తోడేలు బొమ్మ(నిజానికి దీన్ని తోడేలు ఫొటో అనాలి) అలాంటి ఓ నిజమైన అబద్ధమే. ఇందులో ఏం ఉంది? అని గట్టిగా అడిగితే ముగ్గురు యువతులు నగ్నంగా ఉన్నారని చెప్పక తప్పదు మరి!
ఇటలీకి చెందిన యువ బాడీపెయింటర్ జొహానెస్ స్కాటర్ తపనకు రూపమే ఈ అద్భుతమైన తోడేలు రూపం. నూలుపోగైనా ధరించని ముగ్గురు మహిళల ఒంటిపై పెయింటింగ్ వేసి, వాళ్లను తోడేలు ఆకారంలో కదలకుండా కూర్చోబెట్టి తీసిన ఫొటో ఇది. ఈ ఒక్క ఫొటో తీయడానికి స్కాటర్ కు దాదాపు ఎనిమిది గంటలు పట్టింది.
ఆరు గంటలు బాడీ పెయింటింగ్ కు పోగా, రెండు గంటలకు వాళ్లను సరైన పొజిషన్ లో కూర్చోబెట్టడానికి పట్టిందట. 2012 నుంచి ఈ రూపం కోసం ఎన్నెన్నో స్కెచ్ లు గీసుకుని, చివరికి విజయం సాధించాడు. ఈ ఫొటో విడుదలైనప్పటి నుంచి స్కాటర్ కు ప్రశంసలే ప్రశంసలు. అన్ని గంటలు శ్రమకోర్చి ఒంటిపై పెయింటింగ్ వేయించుకుని, అచ్చం తోడేలులా పోజుపెట్టిన ఆ ముగ్గురు వైల్డ్ ఉమన్ కు కూడా లక్షల సంఖ్యలో గ్రీటింగ్స్ అదుతున్నాయి.
ముగ్గురమ్మాయిలతో..
Published Sat, Jun 4 2016 10:58 AM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM