ఉగ్రవాదులకోసం సద్దాం కొంప కూల్చారు | British jets strike ISIS training camp in Saddam Hussein's former palace | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులకోసం సద్దాం కొంప కూల్చారు

Published Wed, Aug 3 2016 6:19 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

ఉగ్రవాదులకోసం సద్దాం కొంప కూల్చారు

ఉగ్రవాదులకోసం సద్దాం కొంప కూల్చారు

బాగ్దాద్: మోసుల్ లోని సద్దాం హుస్సేన్ పాత నివాస విల్లాను బ్రిటన్ యుద్ధ విమానాలు కూల్చేశాయి. ఆ విల్లాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారని తెలుసుకొని జరిపిన వైమానిక దాడుల్లో అది పూర్తిగా ధ్వంసం అయినట్లు బ్రిటన్ రక్షణశాఖ అధికారి ఒకరు చెప్పారు.

సోమవారం ఉదయం రెండు రాయల్ ఎయిర్ ఫోర్స్ టైపూన్స్ మోసుల్ లోని ఈ ఉగ్రవాదులకు నిలయమైన సద్దాం ప్యాలెస్ ను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించాయని చెప్పారు. టైగ్రిస్ నదికి సమీపంలో ఈ ప్యాలెస్ ఉందని, ఇందులో విదేశాల నుంచి తీసుకొచ్చిన యువతకు ఉగ్రవాదులు శిక్షణ ఇస్తున్నారని వారు వివరించారు. భారీ తీవ్రత ఉన్న బాంబులను యుద్ధ విమానాలు విజయవంతంగా జారవిడిచాయని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement