ఒట్టావా : దీపావళి పర్వదినం ససందర్భంగా హిందువులకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రడువ్ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపిన.. ఆయన అందులో పేర్కొన్న ఒక పదం వివాదాస్పదంగా మారింది. వేల మంది ఆయనపై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. ఇంతకూ ఆయన తన ట్విటర్‌లో ఏమన్నారంటే... ’’ హిందువులందరికీ దీపావళి ముబారక్‘‘ అని చెప్పారు. నలుపు రంగు షేర్వానీలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఫొటో పెట్టి.. దీపావళి శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు. అంతేకాక ఒట్టావాలో రాత్రి దీపావళిని ఉత్సాహంగా జరుపుకుంటాం అని అందులో పేర్కొన్నారు. జస్టిన్ ట్రడువ్ ట్వీట్‌ను 3 లక్షల మంది లైక్ చేశారు.
ఇదాఇలా ఉండగా.. ఈ ట్వీట్‌పై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. దీపావళి పండుగకు శుభాకాంక్షలు చెప్పినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు.. అందుఏలో ముబారక్ అనే పదాన్ని తొలంగించండి అని కొందరు.. రీ ట్వీట్ చేశారు. మరికొందరైతే ముబారక్ అనేది అరబిక్ పదం.. దానిని హిందువులకు ఎలా ఆపాదిస్తారు? అని ప్రశ్నించారు.
Diwali Mubarak! We're celebrating in Ottawa tonight. #HappyDiwali! pic.twitter.com/HBFlQUBhWX
— Justin Trudeau (@JustinTrudeau) 17 October 2017
Comments
Please login to add a commentAdd a comment