‘వికీలీక్స్‌’ మన్నింగ్‌కు శిక్ష తగ్గించిన ఒబామా | Chelsea Manning to Be Released Early as Obama Commutes Sentence | Sakshi
Sakshi News home page

‘వికీలీక్స్‌’ మన్నింగ్‌కు శిక్ష తగ్గించిన ఒబామా

Published Thu, Jan 19 2017 4:17 AM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM

‘వికీలీక్స్‌’ మన్నింగ్‌కు శిక్ష తగ్గించిన ఒబామా

‘వికీలీక్స్‌’ మన్నింగ్‌కు శిక్ష తగ్గించిన ఒబామా

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన కీలక దౌత్య సమాచారాన్ని లీక్‌ చేసిన చెల్సియా మన్నింగ్‌ శిక్షను అమెరికా అధ్యక్షుడు ఒబామా తగ్గించారు. అమెరికా ట్రాన్స్‌జెండర్‌ సైనికురాలైన మన్నింగ్‌(29) ఆ దేశపు కీలక దౌత్యసమాచారం కలిగిన 7,50,000 పేజీలతోపాటు వీడియోలను అపహరించి వికీలీక్స్‌కు లీక్‌ చేసింది. ఈ కేసులో 2013లో ఆమెకు 35 ఏళ్ల జైలు శిక్ష విధించారు. దీనిప్రకారం ఆమె 2045 వరకు జైలు జీవితాన్ని గడపాల్సి ఉంది. కానీ మన్నింగ్‌ జైలు శిక్షను తగ్గిస్తూ అధ్యక్షుడు ఒబామా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమె ఈ ఏడాది మే 17న జైలు నుంచి విడుదల కానుందని అమెరికా శ్వేతసౌధం వర్గాలు బుధవారం వెల్లడించాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement