ఇక్కడ భార్యలతో షాపింగ్ కు భర్తలు ‘క్యూ’..
ఇక్కడ భార్యలతో షాపింగ్ కు భర్తలు ‘క్యూ’..
Published Fri, Jul 14 2017 6:55 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
షాపింగ్ వెళ్దాం అండీ.. అని భార్య అడగగానే ఏ భర్త అయినా ఏదో వంక చెప్పి తప్పించుకుంటారు. ఎందుకంటే వాళ్ల షాపింగ్ త్వరగా పూర్తవ్వక భర్త సహనానికే పరీక్షగా నిలుస్తుంది. అయితే ఈ సమస్యను క్యాచ్ చేసుకున్నారు మన పొరుగు దేశం చైనా వాళ్లు. ఏంలేదండి.. భార్యలు మాల్ అంతా తిరుగుతూ షాపింగ్ చేస్తుంటే భర్తలకు టైంపాస్ అయ్యే వినూత్న పథకం వేశారు. బహుళ గాజు గదిలను ఏర్పాటు చేసి అందులో ఒక కంప్యూటర్, కుర్చీ, గేమ్ ప్యాడ్ ను సిద్దం చేశారు. సింపుల్ గా చెప్పాలంటే గేమింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. అయితే మన దగ్గర గేమింగ్ జోన్లలా కాకుండా ఒక్క గేమింగ్ జోన్ లో 1990 గేమ్ లు ఆడవచ్చంటా.. అయితే ఈ సర్వీస్ ను ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్నామని.. భవిష్యత్తులో కొంత చార్జీలు వసూలు చేస్తామని చెబుతున్నారు ఆ షాపింగ్ మాల్‌ల పనిచేసే ఉద్యోగులు.
ఈ మాల్ కు భార్యలతో షాపింగ్ కు వచ్చిన భర్తలంతా మాల్ ఐడీయా బాగుందని ప్రశంసిస్తున్నారు. యాంగ్ అనే ఒకాయన అయితే తన స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయని సంబూరపడ్డాడు. ఇంకో ఆయన ఈ ఆలోచన బాగుంది.. కానీ గేమింగ్ జోన్ లో ఏసీ లేదు.. వెంటిలేషన్ లేదు గాలి రాక ఇబ్బందిపడ్డా అన్నాడు. ఇదంతా ఏ షాపింగ్ మాల్ లో అబ్బా అనుకుంటున్నారా..? అదే చైనా షాంఘై పట్టణంలోని గ్లోబల్ హర్భర్ మాల్ వారు ఈ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.. ఈ ప్లాన్ మనదేశం షాపింగ్ మాల్ లో కూడా చేస్తే బాగుండు కదా...! మీరు మీ భార్యలతో షాపింగ్ కు ‘క్యూ’ కడుదురు..!
Advertisement