లండన్ : బ్రిటన్‌లో శ్వేత జాతీయులైన బ్రిటీష్ వారికన్నా చైనీయులు, భారతీయులు అధిక మొత్తాల్లో జీతాలు అందుకుంటున్నారు. అన్ని దేశాల వారికన్నా చైనీయులు అత్యధికంగా వేతనాలు అందుకుంటుంటే భారతీయులు, బ్రిటీష్‌వారికన్నా 12 శాతం భారతీయులు అధిక వేతనాలు అందుకుంటున్నారని ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటస్టిక్స్’ స్వచ్ఛందంగా నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడయింది. శ్వీత జాతీయులకన్నా భారతీయులు అధిక జీతాలు అందుకోవడానికి వృత్తిపరమైన నైపుణ్యంతోపాటు విద్యార్హతలు ఎక్కువగా ఉండడం కారణాలని అధ్యయనంలో తేలింది.
జీతాల విషయంలో బంగ్లాదేశీయులు బాగా వెనకబడి ఉన్నారు. బ్రిటీష్ వారికన్నా తక్కువ వేతనాలు అందుకుంటున్న దేశాల జాబితాలో బంగ్లాదేశీయులు ఐదో స్థానంలో ఉన్నారు. 30 ఏళ్లలోపున్న నల్ల జాతీయులు, కరేబియన్ కార్మికులు అదే ఏజ్ గ్రూప్ బ్రిటీష్ కార్మికులతో దాదాపు సమానంగా జీతాలు అందుకుంటున్నారు. ఒకే విద్యా, వృత్తి అర్హతలు కలిగిన బ్రిటీష్ వారికి, ఇతర జాతీయులకు మధ్య వేతనాల్లో పెద్దగా తేడాలేదు. ఇది క్రమంగా తగ్గుతూ వస్తోంది. విద్యార్హతలు, వృత్తిపరమైన నైపుణ్యం ఎక్కువగా ఉండడం వల్లనే చైనీయులతోపాటు భారతీయులు ఎక్కువ వేతనాలు అందుకుంటున్నారు.
ఓ చైనా ఒద్యోగి సగటున గంటకు 15.75 డాలర్లు సంపాదిస్తుండగా, భారతీయ ఉద్యోగి 13.47 డాలర్లు, బ్రిటీష్ జాతీయులు 12.30 డాలర్లు, బంగ్లాదేశీయులు 9.60 డాలర్లు సంపాదిస్తున్నారు. గంటకు పది డాలర్లతో పాకిస్థాన్ జాతీయులు బంగ్లాదేశ్‌కన్నా కాస్త మెరుగైన స్థానంలో ఉన్నారు. ఇతర ఆసియా దేశస్థులు గంటకు 11.55 డాలర్లతో బ్రిటీష్ వారికన్నా కాస్త తక్కువ వేతనాలు అందుకుంటున్నారు. వయస్సు ఎక్కువగా ఉన్న బ్రిటీష్, ఇతర జాతీయుల వేతనాల మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉండగా, యువకుల వేతనాల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment