లిబియా మిలిటెంట్ల కాల్పుల్లో 31 మంది మృతి | Deaths at Libya anti-militia protest in Tripoli | Sakshi
Sakshi News home page

లిబియా మిలిటెంట్ల కాల్పుల్లో 31 మంది మృతి

Published Sun, Nov 17 2013 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM

Deaths at Libya anti-militia protest in Tripoli

ట్రిపోలి: లిబియా రాజధాని ట్రిపోలి శివార్లలో తెల్లజెండాలు ధరించి నిరసన ప్రదర్శన కొనసాగిస్తున్న నిరసనకారులపై శుక్రవారం సాయంత్రం సాయుధ మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. కాల్పుల్లో 31 మంది మృతి చెందగా, దాదాపు 200 మంది గాయపడ్డారు. హింసాకాండకు మిలిటెంట్లతో పాటు నిరసనకారులు కూడా బాధ్యులని లిబియా ప్రధాని అలీ జిదాన్ ఆరోపించారు. అయితే, నిరసనకారుల చేతుల్లో ఆయుధాలేవీ లేవని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. ఈ సంఘటన తర్వాత ట్రిపోలిలోని చెక్‌పోస్టుల వద్ద భద్రతను మరింత పెంచారు.