Ali Zeidan
-
లిబియా మిలిటెంట్ల కాల్పుల్లో 31 మంది మృతి
ట్రిపోలి: లిబియా రాజధాని ట్రిపోలి శివార్లలో తెల్లజెండాలు ధరించి నిరసన ప్రదర్శన కొనసాగిస్తున్న నిరసనకారులపై శుక్రవారం సాయంత్రం సాయుధ మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. కాల్పుల్లో 31 మంది మృతి చెందగా, దాదాపు 200 మంది గాయపడ్డారు. హింసాకాండకు మిలిటెంట్లతో పాటు నిరసనకారులు కూడా బాధ్యులని లిబియా ప్రధాని అలీ జిదాన్ ఆరోపించారు. అయితే, నిరసనకారుల చేతుల్లో ఆయుధాలేవీ లేవని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. ఈ సంఘటన తర్వాత ట్రిపోలిలోని చెక్‌పోస్టుల వద్ద భద్రతను మరింత పెంచారు. -
లిబియా ప్రధాని అలీ జియాదన్ కిడ్నాప్
-
లిబియా ప్రధాని అలీ జియాదన్ కిడ్నాప్
లిబియా : లిబియాలో తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. ఏకంగా దేశ ప్రధానినే కిడ్నాప్ చేశారు. ట్రిపోలోని ఓ హోటల్లోఉన్న ప్రధాని అలీ జియాదన్ను తిరుగుబాటుదారులు అపహించారు. ప్రధాని కిడ్నాప్ అయ్యారన్న వార్తతో లిబియా ప్రజలు ఉలిక్కిపడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, అనుక్షణం నిఘా నీడలో ఉండే ప్రధానిని.....తిరుగుబాటుదారులు ఎలా అపహరించారనేది సస్పెన్స్‌గా మారింది. దేశప్రధానిని కిడ్నాప్ చేయటం లిబియాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.