ఎడారి ‘రాజ’ నగరం | Desert 'royal' city | Sakshi
Sakshi News home page

ఎడారి ‘రాజ’ నగరం

Published Sun, Apr 12 2015 3:58 AM | Last Updated on Mon, Aug 20 2018 7:33 PM

ఎడారి ‘రాజ’ నగరం - Sakshi

ఎడారి ‘రాజ’ నగరం

మనిషి తలుచుకుంటే అసాధ్యమంటూ లేదనడానికి ఈ మహానగరమే నిదర్శనం. ఆకాశాన్నంటే భవనాలు.. రాజ సౌధాలను తలపించే కట్టడాలు.. నగరం మధ్యలో నీటి సరస్సులు.. ఇవన్నీ ఎడారి రాజ్యంలో ఎర్ర సముద్రపు ఒడ్డున నిర్మించతలపెట్టిన ఓ మహానగరం సోయగాలు. దీనికయ్యే ఖర్చు ఎంతో తెలుసా..? అక్షరాలా 6 లక్షల కోట్లు. 20 లక్షల మంది నివసించేందుకు వీలుగా సకల సదుపాయాలు, అన్ని హంగులతో ఈ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.

దాదాపు 110 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ నగరం పేరు కింగ్ అబ్దుల్లా ఎకానమిక్ సిటీ.. వాషింగ్టన్ నగరమంత పెద్దగా ఉంటుందట.. సౌదీ అరేబియా రాజధాని జెడ్డాకు 100 కి.మీ దూరంలో ఈ నగరాన్ని నిర్మిస్తున్నారు. ఇంతవరకూ 15 శాతం మాత్రమే పూర్తయిన ఈ నగరం త్వరలోనే పర్యాటకులను ఆకర్షించనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement