అడెన్: మరోసారి విమానాశ్రయం లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈసారి యెమెన్లో వారు పైశాచికత్వం ప్రదర్శించారు. అడెన్ విమానాశ్రయానికి సమీపంలో రెండు కారుబాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, అక్కడే ఉన్న మిలటరీ స్థావరం, ఎయిర్ పోర్ట్ లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.
చనిపోయిన వాళ్లంతా మిలటరీ చెందిన వారే. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడిందనే విషయం ఇంకా తెలియరాలేదు. ప్రపంచ దేశాల్లో కొద్ది రోజులుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ఈ సంస్థ ఈ దాడులు చేస్తున్న నేపథ్యంలో తాజాగా యెమెన్ దాడి కూడా వారి పనే అని అధికారులు అనుమానిస్తున్నారు. ఒక కారు మిలటరీ క్యాంపు బేస్ వద్ద పేల్చగా.. మరో కారును క్యాంపు లోపలికి తీసుకెళ్లాక పేల్చారు.
మరో ఎయిర్పోర్ట్ సమీపంలో కారుబాంబు పేలుళ్లు
Published Wed, Jul 6 2016 10:33 AM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM
Advertisement