'నేను ఉత్ప్రేరకాలు వాడేదాన్ని' | Dutch 1984 Olympic gold winner Stalman admits to doping | Sakshi
Sakshi News home page

'నేను ఉత్ప్రేరకాలు వాడేదాన్ని'

Published Sat, Jan 9 2016 2:19 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

'నేను ఉత్ప్రేరకాలు వాడేదాన్ని'

'నేను ఉత్ప్రేరకాలు వాడేదాన్ని'

ది హేగ్: ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత.. తాను నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు సంచలన ప్రకటన చేసింది. 1984 ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన డచ్ డిస్కస్ త్రో క్రీడాకారిణి రియా స్టాల్మన్ శుక్రవారం ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ తన కెరీర్ చివర్లో ఉత్ప్రేరకాలు వాడేదాన్ని అని వెల్లడించింది.

'అప్పట్లో చాలా మంది మహిళలు ఉత్ప్రేరకాలు వాడేవారు. వారిని నేను చిత్తుగా ఓడించాలనుకునే దాన్ని అందుకోసం నేను కూడా శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి ఉత్ప్రేరకాలు వాడేదాన్ని' అని తెలిపింది. ఉత్ప్రేరకాలు వాడినటువంటి ప్రత్యర్థులను ఓడించలేనప్పుడు మనమూ వారి దారిలోకి వెళ్లడమే సరైన మార్గం అని అప్పుడు భావించానని తెలిపింది. ప్రాక్టీస్లో భాగంగా ఎక్కువ శారీరక శ్రమ కలిగినప్పుడు సైతం త్వరగా కోలుకోవడానికి ఉత్ప్రేరకాలు వాడేదాన్ని అని 64 ఏళ్ల రియా స్టాల్మన్ వెల్లడించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement