గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనండి... భూమ్మీద ‘పాపం’ పెరిగిపోయిందనండి... సమీప భవి ష్యత్తులో అగ్రరాజ్యం అమెరికా తీవ్ర కరువును చూడబోతోంది. గత వెయ్యేళ్లలో కనీవినీ ఎరుగని క్షామం అమెరికాను వణికించనుంది. ప్రఖ్యాత జాతకరత్నలు చెప్పిన విషయం కాదిది. ఏళ్లకేళ్లుగా అమెరికా సీమలో వేళ్లూనుకుని ఉన్న తరువులు చెబుతున్నాయి. ఇటీవల చెట్లపై జరిగిన పరిశోధనల్లో ఈ దుర్భిక్షం ఛాయలు వెల్లడయ్యాయి. ఈ సంగతి చెట్లకెలా తెలుసంటారా? చెట్లను కొట్టి వేసినపుడు... వాటి దుంగల్లో కనిపించే వలయాలు ఆ చెట్టు పుట్టుపూర్వోత్తరాలే కాదు, కాలమాన పరిస్థితులనూ వెల్లడిస్తాయి.
ఈ వలయాల మధ్య తగినంత దూరం ఉంటే సమృద్ధిగా వర్షాలు కురి సినట్టు. అదే వలయాలు దగ్గరగా ఉంటే... ఆ సమ యంలో కరువు ఏర్పడినట్టు కొండగుర్తు! ఈ లెక్క లన్నీ క్రోడీకరించి... రానున్న రోజుల్లో ముఖ్యంగా అమెరికా దక్షిణరాష్ట్రాలు కరువుతో విలవిల్లాడ నున్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. ఇప్పటికే కాలిఫోర్ని యా, ఆరిజోనా, నెవడా, న్యూ మెక్సికో, టెక్సాస్, ఒక్లహామా రాష్ట్రాలు కరువుతో కుస్తీ పడుతున్నాయి. గత నాలుగేళ్లుగా ఈ రాష్ట్రాల్లో సరైన వానలు లేవు. భవిష్యత్తులో ఇది మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరికలు జారీ చేశారు.
అమెరి‘కరువు’
Published Sun, Apr 12 2015 1:27 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement