మహిళల ఆత్మాహుతి దాడి
అబుజా: నైజీరియాలో ఓ ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకొని ఇద్దరు మహిళలు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. భారీ స్థాయిలో బాంబుల జాకెట్లను ధరించి తమను తాము పేల్చేసుకున్నారు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మైదుగురి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మైదుగురినిలోని మోలాయి ప్రాంతంలో ఓ ప్రభుత్వ ఆస్పత్రి ఉంది.
సాధారణ మహిళలుగానే ఆస్పత్రిలోకి ప్రవేశిస్తుండగా అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది వారిని తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా పేల్చేసుకున్నారు. దీంతో సమీపంలోని సెక్యూరిటీ సిబ్బంది మరికొందరు చనిపోయారు. బోకోహారానికి చెందిన ఉగ్రవాదులే ఈ దారుణం చేయించి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు.