హైబ్రిడ్ మాంసాహార మొక్క!
కీటకాలను, చిన్న చిన్న ప్రాణులను తమ జిగట సంచుల్లో వేసుకుని హాంఫట్ చేసేసే నెపంథీస్, డ్రసిరా వంటి మాంసాహార మొక్కల గురించి మనకు ఇదివరకే తెలుసు. అయితే అమెరికాకు చెందిన మాథ్యూ కేలిన్ అనే హార్టికల్చరిస్ట్ మాంసాన్ని గుటకలు వేస్తూ మింగేసే ఈ హైబ్రిడ్ మాంసాహార మొక్కను సృష్టించాడు. హాలీవుడ్ దర్శకుడు రిడ్లీ స్కాట్ తీసిన ఏలియన్ సినిమాల్లోని భయంకర మాంసాహార మొక్కల్లా ఇలాంటి హైబ్రిడ్ మొక్కలనూ భారీ సైజులో సృష్టిస్తే ఇంకేమైనా ఉందా..?
మనుషులను ఇట్టే గుటుక్కున మింగేయవూ? అని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఆ భయం అక్కర్లేదంటున్నారు మాథ్యూ. రిడ్లీ సినిమాల్లో భారీ మాంసాహార మొక్కల్ని డిజైన్ చేసిన ఆర్టిస్ట్ హెచ్‌ఆర్ గిగర్ గతేడాది చనిపోయారు. ఆయన స్మారకార్థమే ఈ హైబ్రిడ్‌ను సృష్టించానని, ఈ హైబ్రిడ్ రకానికి ఆయన పేరే పెట్టానని వెల్లడించారు.