
ఎయిర్ పోర్టులో బాంబు పేలుడు
బీజింగ్:
బాంబు పేలుడుతో చైనాలోని షాంగై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం దద్దరిల్లింది. ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 2 లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడులో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.