ఈ సరస్సుపై మీరూ నడవగలరు..! | Frozen bubbles in Canadian lakes | Sakshi
Sakshi News home page

ఈ సరస్సుపై మీరూ నడవగలరు..!

Published Wed, Feb 18 2015 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

ఈ సరస్సుపై మీరూ నడవగలరు..!

ఈ సరస్సుపై మీరూ నడవగలరు..!

చూడ్డానికి లోతుగానే ఉన్నట్టుంది.. నడవడం ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? నీటితో నిండుగా కళకళలాడుతున్నట్లు కనిపిస్తున్నా.. వాస్తవానికి ఈ సరస్సు గడ్డకట్టుకుపోయి ఉంది! నీటిలో మొలిచిన భారీ పుట్టగొడుగుల్లా కనిపిస్తున్నవి మీథేన్ గాలి బుడగలు. సరస్సు గడ్డకట్టుకుపోవడంతో అవి లోపలే ఇలా చిక్కుకుపోయాయి. మంచు కరిగిపోయిన తర్వాతే ఈ బుడగలు పేలి మీథేన్ గ్యాస్ విడుదలవుతుందట.

ఈ బుడగలకు నిప్పును అంటిస్తే.. చిన్నపాటి బాంబుల్లా ఢామ్మని పేలిపోతాయట. ఏటా శీతాకాలంలో గడ్డకట్టుకుపోయి ఇలా.. కనువిందు చేసే ఈ సరస్సు పేరు మిన్నెవాంకా. కెనడాలోని బాంఫ్ నేషనల్ పార్కులో ఉంది. ఈ సరస్సును ఇటీవల సందర్శించిన పాల్ జిజ్‌కా అనే ఫొటోగ్రాఫర్ అద్భుతమైన ఫొటోలు తీయడమే కాకుండా.. అటూఇటూ నడిచి ఇలా ముచ్చట తీర్చుకున్నాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement