చైనాలో భారీ పేలుడు: 44 మంది మృతి | heavy Explosion in China's Tianjin, 300 Injured | Sakshi
Sakshi News home page

చైనాలో భారీ పేలుడు: 44 మంది మృతి

Published Thu, Aug 13 2015 6:31 AM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

చైనాలో భారీ పేలుడు: 44 మంది మృతి

చైనాలో భారీ పేలుడు: 44 మంది మృతి

బీజింగ్: ఉత్తర చైనాలోని తీర పట్టణం టాంజిన్ లో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 44 మంది మరణించగా.. 400 మందికిపైగా గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది. మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూనే ఉంది.

షిప్పింగ్ యార్డులో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భారీగా మంటలు ఎగిసిపడటంతో పలువురు గాయపడినట్లు తెలిసింది. అయితే ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement