
బ్రిటన్ దిశగా దూసుకొస్తున్న ‘హెర్క్యులస్’
‘హెర్క్యులస్’ తుపాను ప్రభావంతో బ్రిటన్‌లోని కార్న్‌వాల్‌లో లాండ్స్ ఎండ్ తీరం వద్ద దాదాపు 27 అడుగుల ఎత్తున ఎగసి పడుతున్న పెను అలలు. శీతాకాల తుపాను ‘హెర్క్యులస్’ అమెరికా నుంచి బ్రిటన్ వైపు దూసుకొస్తుండటంతో పెనుగాలుల తాకిడికి బ్రిటన్‌లోని దక్షిణ, పశ్చిమ తీర ప్రాంతాలు అల్లాడుతున్నాయి. కొద్దిరోజుల కిందటే మంచు తుపాను తాకిడికి అమెరికాలో తలెత్తిన పరిస్థితులే ప్రస్తుతం బ్రిటన్‌లోనూ ఉన్నాయని వాతావరణ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.