సెల్‌ఫోన్‌ చెంత ఉంటే మెదడు డీలా | How Smartphones Hijack Our Minds | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ చెంత ఉంటే మెదడు డీలా

Published Fri, Nov 17 2017 12:48 PM | Last Updated on Fri, Nov 17 2017 1:26 PM

How Smartphones Hijack Our Minds - Sakshi - Sakshi - Sakshi - Sakshi

వాషింగ్టన్ ‌: స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక జీవితం సుఖమయం అయిందని అనిపిస్తోంది. కానీ, ఈ సౌఖ్యాల మాటున ప్రమాదాలూ పొంచి ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఫోన్‌ చెంతనే ఉంటే ఏకాగ్రత దెబ్బతింటుందని, మెదడు పనితీరును ప్రభావితం చేస్తుందని తాజా అధ్యయనంలో తేలిందట! యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు కొంతమంది వలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరీక్షలు జరిపి ఈ విషయాన్ని నిర్దారించుకున్నారు.

ఇందులో భాగంగా 800 మంది మొబైల్‌ఫోన్‌ యూజర్లను ఎంపిక చేశారు. వలంటీర్ల పనితీరును, మొబైల్‌ అందుబాటులో ఉన్నపుడు (దానిని ఉపయోగించకపోయినా సరే) పనిలో, ఏకాగ్రతలో కలిగే మార్పులను పరిశీలించగా తాము ఈ విషయాన్ని గమనించినట్లు పరిశోధకులు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement