smartphone addiction
-
పిల్లలు సెల్‌ఫోన్, టీవీకి అడిక్ట్ అయ్యారా?.. కడుపులో నులిపురుగులు ఉంటే..
మా అబ్బాయి / అమ్మాయి సెల్‌ఫోన్ / టీవీకి అడిక్ట్ అయిపోయారు. పుస్తకం ముట్టుకోవడానికి ఇష్టపడం లేదు !” అని కొంత మంది పేరెంట్స్ అంటున్నారు. నిజానికి మనం నేర్పే వాటినే పిల్లలు నేర్చుకొంటారు. మన ప్రమేయం లేకుండా పిల్లలు, ముఖ్యంగా అయిదేళ్ల లోపు పిల్లలు ఏదీ నేర్చుకోరు. పిల్లలు మనల్ని అనుకరిస్తారు. ఇలా చెయ్యండి 1 . ఎటువంటి పరిస్థితుల్లో పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇవ్వొద్దు. “ అది పెద్దల కోసం.. అవసరానికి మాత్రం వినియోగించడానికి “ అని చెప్పండి. 2 . మీరు టీవీ ముందు, సెల్‌ఫోన్‌తో గడిపే కాలాన్ని తగ్గించండి. 3 . ఆసక్తి కలిగిన పుస్తకాలు చదవండి. పిల్లలు దాన్ని అనుకరిస్తారు. 4 . పిల్లలతో సమయం గడపండి. వారికి రకరకాల ఆటలు నేర్పండి. వారితో ఆడండి. 5 . పిల్లలకు కథలు చెప్పండి. దాని గురించి వారితో చర్చించండి. దీని వల్ల క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. అన్నిటికీ మించి మీ పిల్లలు మీరు చెప్పింది వినడం చేస్తారు. పెద్దయ్యాక కూడా ఇది కొనసాగుతుంది . మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు . 6 . పిల్లలు ఆకలేస్తే తింటారు. కడుపులో నులిపురుగులు లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆకలి తగ్గుతుంది. దానికి ట్రీట్మెంట్ అవసరం. నాలుగు గంటలకు స్వీట్స్ ఐస్ క్రీం లాంటి హై కెలొరీ ఫుడ్ ఇచ్చి, మరో మూడు గంటల్లో అన్నం తినమంటే తినరు. పిల్లల్ని అన్నం తినిపించే పేరుతొ ఏదైనా చేసి వారికి తినడం పైన ఇంటరెస్ట్ పోయేలా చేయకండి. పిల్లల్ని జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచండి. -వాసిరెడ్డి అమర్నాథ్, పాఠశాల విద్య పరిశోధకులు చదవండి: షుగర్ ఎందుకొస్తుంది?.. రాకుండా ఎలా కాపాడుకోవాలి? విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదా? ఎంతవరకు! డాక్టర్లు చెప్తున్నదేంటి? -
స్మార్ట్‌ఫోన్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే..
8 పలమనేరు పట్టణంలో అద్దెగది తీసుకొని ఇంజనీరింగ్ చదవుతున్న ఓ విద్యార్థిని సెల్‌ఫోన్ అతిగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో అప్పటికే సెల్ (smart phone addiction)కు బానిసైన ఆ విద్యార్థి తన గదిలోనే ఆత్మహత్య చేసుకొని ఇటీవలే మృతి చెందాడు. పట్టణంలోని పదోతరగతి చదివే బాలికకు మొబైల్ కొనివ్వలేదని తన చేతిని బ్లేడ్‌తో కోసుకొని ఆస్పత్రి పాలైంది. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి. ఒకప్పుడు ‘అరచేతిలో ప్రపంచం’ అనే నినాదంతో స్మోర్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు సెల్ చేతిలో జీవితమే బందీగా మారిపోయింది. రోజురోజుకూ పెరుగుతున్న మొబైల్ ఫోన్ల వినియోగం అనర్థాలకు దారితీస్తోంది. ఈ ఫోన్ చిన్న, పెద్ద, ఆడ, మగా తేడా లేకుండా, అందరి జీవితాలను అరచేతిలోకి తీసుకుంది. పదుల సంఖ్యలో కంపెనీలను మార్కెట్ నుంచి తరిమేసింది. మంచి కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగపడుతోంది. తక్కువ శాతం మంది మాత్రమే అవసరాలకు వినియోగిస్తున్నారని పలు సర్వేల్లో తేలింది. ఎక్కువ శాతం మంది కాలక్షేపం కోసం ఫోన్ చూస్తుండడం పరిపాటిగా మారింది. అలాంటి వారిని క్రమంగా మొబైల్ బానిసలుగా మార్చేస్తోంది. పలమనేరు (చిత్తూరు): శరీరానికి కాసేపు రక్తం అందకపోయినా, ముక్కుకు శ్వాస ఆడకపోయినా పర్వాలేదుగాని నిమిషం పాటైనా చేతిలో సెల్ లేకుంటే బతకలేమన్నట్టుగా తయారయ్యారు నేటి యువత. డ్రగ్స్‌కు బానిసైనట్లు స్మార్ట్‌ఫోన్ బందీఖానాలో జనం బందీలుగా మారారు. ఇప్పుడు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా స్మార్ట్ఫోన్ల వాడకం ఎక్కువైంది. మొబైల్ లేకుంటే బుర్ర కూడా పనిచేయడం లేదు. మితిమీరిన సెల్ వాడకం మనిషి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నా మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలామంది వారికి తెలియకనే మానసిక రోగుల్లా మారారు. ఇంకొందరు అనారోగ్యం పాలవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పదిలక్షల ఫోన్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1990లో కీప్యాడ్ ఫోన్ల వాడకం మొదలైంది. తొలుత తిరుపతి, చిత్తూరు, కుప్పం, మదనపల్లె వంటి పట్టణాల్లో మాత్రమే రిలయన్స్ మొబైల్ టవర్ల ద్వారా నెట్‌వర్క్‌ను అందిస్తూ సేవలను మొదలు పెట్టారు. ఆపై పలు సెల్ కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 8వేల సెల్‌ఫోన్ టవర్లున్నాయి. ఉమ్మడి జిల్లా జనాభా 44 లక్షలు కాగా వీరిలో సెల్ఫోన్లు వాడేవారి సంఖ్య ప్రస్తుతం 10 లక్షలకు చేరింది. నాలుగేళ్ల నుంచి సెల్ఫోన్ల వాడకం ఏటా 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్ (టెలీఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కలు చెబుతున్నాయి. ఈ ట్రాయ్ గణాంకాలను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. అన్ని రంగాలపై ప్రభావం విద్యార్థులు సెల్‌ఫోన్ వాడకంతో విలువైన సమయాన్ని వృథా చేసుకొని చదువుల్లో వెనుకబడడం, ఫెయిల్ కావడం జరుగుతోంది. ఇక ప్రైవేటు సెక్టార్లలో పనిచేసేవారు ఈ మొబైల్ కారణంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు సెల్‌తోనే రోజంతా గడిపేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ప్రభుత్వ సేవలు కుంటుపడుతున్నాయి. ముఖ్యంగా ఉత్పాదక రంగంలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. ప్రధానంగా ఈ మొబైల్ అధికంగా వినియోగించే వారిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్‌ఓ)తెలిపింది. ఎన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయో డబ్లు్యహెచ్‌ఓ సర్వే వివరించింది. రాత్రి పూటే ప్రమాదకరం ప్రధానంగా రాత్రిపూట నిద్రపోకుండా సెల్చూడడం వల్ల కొన్ని రోజుల తర్వాత నిద్రరాని పరిస్థితి ఏర్పడుతుంది. శరీరంలో మెలటోనియన్ నిల్వలు నశించి డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. చీకట్లో సెల్‌ఫోన్ చూడడంతో దాని నుంచే వచ్చే బ్లూ కిరణాలు రెటీనాను బలహీనం చేసే కార్ట్‌డాక్ సమస్యలు తప్పవు. రాత్రుల్లో ఫోన్ చూసే పిల్లలకు తలనొప్పి, చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీంతోపాటు మెడనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సెల్ సమస్యలు: ► నిద్రలేమి, తలనొప్పి ► భుజం, మెడ నొప్పి ► బరువు పెరగడం ► చూపు తగ్గిపోవడం ► జ్ఞాపకశక్తి కోల్పోవడం ► ఏకాగ్రత దెబ్బతినడం ► డిప్రెషన్లోకి వెళ్లడం అనర్థాలపై అవగాహన అవసరం మితిమీరిన సెల్‌ఫోన్ వాడకంతో కలిగే అనర్థాలపై కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం. ఈమధ్య కాలంలో యూట్యూబ్‌లో పలు రకాల చోరీలు, నేరాలను చూసి వాటిని ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. ఇలాంటి వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఏదేనా అవసరం ఉంటే తప్ప ఫోన్ వాడకం తగ్గించాలి. దీంతో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. – గంగయ్య, డీఎస్పీ, పలమనేరు మానసిక ఇబ్బందులు తప్పవు పాలు తాగే పసిపిల్లల నుంచి సెల్ ఉంటేనే అన్నట్లుగా తయారైంది నేటి సమాజం. పిల్లలు ఏడుస్తుంటే బొమ్మలిచ్చే కాలం పోయింది. చేతికి సెల్ ఇస్తేనే వారు ఏడుపు ఆపుతారు. అధికంగా సెల్ వాడడం వలన మెడనొప్పి, కళ్లు కనిపించకపోవడం, తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. ఇక నిద్రపోకుండా రాత్రుల్లో సెల్ చూసేవారికి పలు రకాల ఆరోగ్య సమస్యలు తప్పవు. మనిషికి కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి. – మమతారాణి, ప్రభుత్వ చిన్నపిల్లల వైద్య నిపుణులు -
పిల్లలు ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? టైమ్ లేదని తప్పించుకోకుండా ఇలా చేయండి!
చాక్లెట్ ఇస్తే స్కూలుకెళ్తా... ఒకప్పటి డిమాండ్ ఇది. సైకిల్ కొనిస్తేనే స్కూలుకెళ్తా... ఇప్పుడిదీ పాతబడిపోయింది. ‘స్మార్ట్‌ఫోన్ ఇవ్వకపోతే స్కూలుకెళ్లను’ కరోనా మార్పు ఇది. పిల్లలు సెల్‌ఫోన్‌కి అడిక్ట్ అయిపోవడం గురించి దశాబ్దకాలంగా మాట్లాడుతున్నాం. కానీ ఈ రెండేళ్ల కాలం పిల్లలకు సెల్‌ఫోన్ ఇచ్చి తీరాల్సిన అవసరాన్ని తెచ్చింది కరోనా. ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల శకం ముగిసింది. ఆఫ్‌లైన్ క్లాసులు మొదలవుతున్నాయి. అయినా పిల్లలు మాత్రం సెల్‌ఫోన్ వదలడానికి ఇష్టపడడం లేదు. ఈ అడిక్షన్ నుంచి పిల్లలను బయటకు తీసుకురావడం పెద్ద సవాల్. ఇందుకు ‘పిల్లల దృష్టిని మళ్లించడం, మరొక విషయం మీద దృష్టిని కేంద్రీకరించేటట్లు చూడడమే పరిష్కారం’ అన్నారు చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ సుదర్శిని. మనిషి సామాజిక జీవి. మనుషులతో కలవకపోతే మానసిక రోగి అవుతాడు. కరోనా దేహ ఆరోగ్యంతో చెలగాటం ఆడుకుని సరిపెట్టలేదు. వ్యాధి బారిన పడిన వాళ్లను, పడని వాళ్లను కూడా మానసికంగా వేధిస్తూనే ఉంది. పిల్లల్లో ఆ దుష్ప్రభావాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. పిల్లలు స్కూలుకెళ్లినప్పుడు క్లాస్‌లో ఇతర పిల్లలతో ఎలా మెలగుతున్నారనే విషయాన్ని తరచూ టీచర్లను అడిగి తెలుసుకునే వాళ్లు పేరెంట్స్. ఈ కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులే కావడంతో పిల్లలు కళ్ల ముందే ఉన్నారుగా అనే ఉద్దేశంలో పిల్లల బిహేవియర్ మీద దృష్టి పెట్టలేదనే చెప్పాలి. ఇవి కాకుండా తల్లిదండ్రుల్లో ఇద్దరూ చెరో లాప్‌ట్యాప్‌లో ఆఫీస్ పనిలో నిమగ్నం కావడం లేదా ఒకరు ఇంటి పనిలో మునిగిపోవడంతో పిల్లల్లో మానసిక పరమైన అవాంఛనీయ ధోరణులను గమనించలేకపోవడం కూడా కాదనలేని విషయమే. ఇక పిల్లల విషయానికి వచ్చేటప్పటికి... గతంలో పేరెంట్స్‌ని సెల్‌ఫోన్ అడిగితే కొద్దిసేపు ఇచ్చి టైమ్ కండిషన్ పెట్టేవాళ్లు. ఆన్లైన్ క్లాసుల కారణంగా ఫోన్ అధికారికంగా చేతికి వచ్చేసింది. ఇక ఏం కావాలి? హ్యాపీగా ఫోన్‌తో పండగ చేసుకున్నారు. క్లాస్ పూర్తయిన తర్వాత కూడా బయటకు వెళ్లి ఆడుకునే పరిస్థితి లేకపోవడంతో ఫోన్‌కు అడ్డు చెప్పలేని పరిస్థితి పేరెంట్స్‌ది. కరోనా నుంచి ప్రపంచం బయటపడింది. ఆన్లైన్ శకం ముగిసింది. ఆఫ్‌లైన్ క్లాసులు మొదలయ్యాయి. ఇక స్మార్ట్‌ఫోన్‌తో పనేముంది? కానీ పిల్లలు అలా అనుకోలేకపోతున్నారు. స్మార్ట్ ఫ్రెండ్ ‘‘పిల్లలను సరిదిద్దడానికి అనుసరించాల్సిన ప్రధాన సూత్రం ఏమిటంటే... వాళ్ల చేతి నుంచి ఒకటి తీస్తున్నప్పుడు ఆ చేతిలో మరొకటి పెట్టడమే. డిస్ట్రాక్షన్, డైవర్షన్ ద్వారా వాళ్ల చేత మనం ఏం చేయించాలనుకుంటున్నామో ఆ పని చేయించడం అన్నమాట. పది–పన్నెండేళ్లలోపు పిల్లలను దారిలో పెట్టడం, టీనేజ్ పిల్లలను దారిలో పెట్టడం దేనికదే భిన్నం. ఇటీవల మా దగ్గరకు వస్తున్న కేసులను పరిశీలిస్తే కొంతమంది చిన్న పిల్లల్లో ఆటిజమ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. సమగ్రంగా పరీక్షించి, గతంలో వాళ్ల ప్రవర్తనను విశ్లేషించి చూస్తే నిజానికి వాళ్లకు ఆటిజమ్ లేదని నిర్ధారణ అవుతుంది. పిల్లలు హైపర్ యాక్టివ్‌గా ఉంటూ, వాళ్లడిగినప్పుడు ఫోన్ ఇవ్వకపోతే చేతిలో ఉన్న వస్తువును విసిరికొట్టడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం కరోనా కారణంగా భౌతికదూరం పాటించడం కోసం విపరీతమైన సామాజిక దూరం పాటిస్తూ ఉండడమే. వాళ్ల వయసు పిల్లలను కలవాల్సిన దశలో స్నేహితులకు దూరంగా ఉండాల్సి రావడం కూడా. నెలలు, సంవత్సరాలపాటు ఇంట్లో ఇద్దరు– ముగ్గురు పెద్దవాళ్ల మధ్య వాళ్ల ఆంక్షల మధ్య గడపాల్సి రావడంతో పిల్లల్లో లోలోపల విసుగు ఎక్కువైపోయింది. టీనేజ్‌లో అయితే ఇరిటేషన్ యాంగర్ పెరిగిపోతుంది. దాని నుంచి బయటపడడానికి ఫోన్‌తో స్నేహం చేస్తూ, ఫోన్‌తోనే సాంత్వన పొందడానికి అలవాటు పడ్డారు. (చదవండి: చద్దన్నం ప్రయోజనాలు ఇవే.. రోజూ తిన్నారంటే..) ప్రశంస పని చేస్తుంది! ఇప్పుడు ఫోన్ వాడకం మీద ఆంక్షలు పెట్టక తప్పని పరిస్థితి. అయితే పిల్లలు ఆ ఆంక్షలను స్వీకరించడానికి సిద్ధం కావడం లేదు అసహనం పెరిగిపోతోంది. ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే చేతిలో ఉన్న వస్తువులను విసిరి కొట్టడం, పుస్తకాలను చించేయడంతోపాటు పుస్తకాలను మాయం చేస్తున్నారు. ఆ కండిషన్ నుంచి బయటపడాలంటే పేరెంట్స్ ఆంక్షలు పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. రిలాక్సేషన్ టెక్నిక్ ని ఫాలో అవ్వాలి. కుటుంబంలో ఒకరితో ఒకరు కలిసి గడిపే సమయాన్ని పెంచుకోవాలి. ఆన్లైన్ క్లాసుల కారణంగా పాఠాలు సరిగ్గా అర్థం కాకపోయి ఉంటే ఆ పిల్లలు స్కూలుకు వెళ్లడానికి అస్సలు ఇష్టపడరు. నిజానికి అది మొండితనం కాదు, ఎస్కేప్ కావడానికి మార్గాలు వెతుక్కోవడం అన్నమాట. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకుని ‘నిద్ర సరిపోకపోతే ఉదయం లేవలేవు’ అని చెప్తే చాలు. అలాగే టైమ్‌కి నిద్రపోయిన రోజు తెల్లవారి ఉదయం పిల్లలతో ‘స్క్రీన్కు దూరంగా ఉండడంతో రాత్రి బాగా నిద్రపోయావు, ఆవలింతలు రావడం లేదు కూడా. ముఖం కూడా తాజాగా ఉంది, ఉత్సాహంగా కనిపిస్తున్నావు’ అని ప్రశంసాపూర్వకంగా మాట్లాడాలి. ఈ అడిక్షన్ చిన్నది కాదు! ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓవర్‌నైట్ మారిపోవాలనుకోవడం అత్యాశే. మార్పు వచ్చే వరకు ప్రయత్నాలు చేయాలి. మద్యం అలవాటును మాన్పించడం వంటిదే ఇది కూడా. ఒక్కసారిగా ఫోన్ ఇవ్వడం ఆపేస్తే విత్‌డ్రాయల్ సింప్టమ్స్ మొదలవుతాయి. నిదానంగా తగ్గిస్తూ రావాలి. మొదట్లో చెప్పుకున్నట్లు ఒకటి తీసేయాలంటే ఆ చేతిలో మరొకటి పెట్టాల్సిందే. ఫోన్ బదులు షటిల్ రాకెట్ ఇచ్చి వాళ్లతోపాటు పేరెంట్స్ కూడా ఆడుకోవచ్చు. ఈ విషయంలో ‘టైమ్ లేద’ని తప్పించుకోవద్దు. పిల్లలను దారిలో పెట్టుకోవడం కంటే మించి ఏ పనులూ ప్రధానమైనవి కావని గుర్తించాలి’’ అని వివరించారు చైల్డ్ సైకాలజిస్ట్ సుదర్శిని. (చదవండి: ముఖంపై మృతకణాలు తొలగిపోవాలంటే...) ‘ఆట’విడుపు ఫోన్ నుంచి దృష్టి మళ్లించడానికి ఫిజికల్ యాక్టివిటీని పెంచాలి. పార్క్‌కు తీసుకువెళ్లాలి. పేరెంట్స్ కూడా వాళ్లతోపాటు ఆడాలి లేదా ఆ వయసు పిల్లలను కలుపుకుని ఆడుకునే వీలు కల్పించాలి. దేహం బాగా అలసిపోయినప్పుడు ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలవుతుంది. మెదడు... ఒత్తిడిని దూరం చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్ ద్వారా ప్లెజర్ పీలవడం అనే మార్గానికి అలవాటు పడి ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ, స్నేహాలను పెంచుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెంచుకోవడం ద్వారా ప్లెజర్ అందుతుందన్నమాట. స్కూలు పాత్ర కూడా పెద్దదే! కొంత మంది పిల్లలు అమ్మానాన్నలకు తెలియకుండా ఫోన్‌ను స్కూల్‌కి తీసుకువెళ్లిపోతుంటారు. ఆ అలవాటును ఇంట్లో కంట్రోల్ చేయలేనప్పుడు స్కూల్ యాజమాన్యానికి తెలియచేయాలి. టీచర్లు ‘ఇక ఆన్లైన్ క్లాసులు ఉండవు, ఆఫ్‌లైన్ క్లాసులే. కాబట్టి ఫోన్ వాడాల్సిన పని లేదు’ అని ఒకటికి పదిసార్లు మామూలుగా చెప్పాలి. ఆ తరవాత కొన్నాళ్లకు ‘స్కూల్‌కి ఫోన్ తెస్తే పనిష్మెంట్ ఉంటుంద’ని కూడా హెచ్చరించాలి. పిల్లలను క్విజ్, డ్రాయింగ్ వంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీల్లో నిమగ్నం చేయాలి. – వాకా మంజులారెడ్డి -
మార్కెట్లో విడుదల కానున్న బడ్జెట్ ఫోన్
హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. వచ్చే (సెప్టెంబర్) నెలలో ఇన్ఫినిక్స్ హాట్ 11ను విడుదల చేయనున్నట్లు స్మార్ట్ ఫోన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే ఇన్ఫినిక్స్ నోట్ 7, ఇన్ఫినిక్స్ హాట్ 9, ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్ బడ్జెట్ ఫోన్లతో రూరల్ ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇన్ఫినిక్స్ సంస్థ తాజాగా ఇన్ఫినిక్స్ హాట్ 11 విడుదల ప్రకటనతో ఆఫోన్ ఫీచర్లు, ధర ఎంత? అనే విషయంపై స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆసక్తిని కనబరుస్తున్నారు.ప్రస్తుతం ఆన్ లైన్లో విడుదలైన ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి. ఇన్ఫినిక్స్ హాట్ 11 ఫీచర్లు రెండు మెమరీల వేరియంట్ తో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్,6జీబీ ర్యామ్, 64జీబీ స్టోర్‌తో ఇన్ఫినిక్స్ హాట్ 11 ధర రూ.9,999గా ఉండగా నుంది. మీడియాటెక్ హెలియో G88 సిస్టమ్-ఆన్-చిప్ తో అందుబాటులోకి రానుండగా.. పూర్తి స్థాయిలో ఫీచర్లను ఇన్ఫినిక్స్ సంస్థ విడుదల చేయలేదు. -
తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు పైగా డిస్కౌంట్స్ కూడా
భారత్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీపై హాంగ్ కాంగ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కన్నేశాయి.మార్కెట్ లో పోటీని తట్టుకునేలా తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లతో హాంకాంగ్‌కు చెందిన 'టెక్నో' సంస్థ భారత్ లో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది.టెక్నో కేమన్ 17, టెక్నో కేమన్ 17 ప్రో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. లాంచ్ చేసిన ఈ ఫోన్ జులై 26 నుంచి భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు టెక్నో ప్రతినిథులు తెలిపారు. టెక్నో కేమన్ 17 ఫీచర్స్ 6.8 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియాటెక్ హెలియో జీ805 ఎస్ఓసీ ప్రాసెసర్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ తో పాటు 256 ఎక్స్‌టెండెబుల్ మెమొరీని అందిచనుంది. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సౌలభ్యంతో అందుబాటులోకి రానుండగా దీని ప్రారంభ ధర రూ. 12,999గా ఉంది టెక్నో కేమన్ 17 ప్రో 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియాటెక్ హెలియో G95 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుండగా, 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 48 మెగా పిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇక ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 16,999 ఉండగా..రూ. 1,999 డిస్కౌంట్ లభిస్తుంది. -
డిజిటల్ చదువు.. కంటికి బరువు
అంటే పరోక్షంగా ఇది వారి కళ్లకు కూడా పరీక్షా కాలమే.. ముఖ్యంగా డిజిటల్ లెర్నింగ్ సర్వసాధారణంగా మారిన పరిస్థితుల్లో రాత్రి పగలూ తేడా లేకుండా కళ్లను తప్పని సరి శ్రమపెట్టాల్సిన విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అగర్వాల్స్ ఐ హాస్పిటల్‌కు చెందిన కన్సెల్టంట్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ మాధవి మాజేటి సూచిస్తున్నారు. ఆమె అందిస్తున్న సూచనలివే... సాక్షి, సిటీబ్యూరో: సాధారణ సమయాల్లోనే గంటల కొద్దీ కంప్యూటర్ స్క్రీన్స్, మొబైల్ ఫోన్ స్క్రీన్స్‌కు కళ్లను అతికించేసే విద్యార్థులు కంటి ఆరోగ్యం గురించి తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. మరోవైపు పరీక్షల సమయంలో వారి చదువులు కూడా ఆన్లైన్ ఆధారితం కావడం, ఇంటర్నెట్ నుంచి మెటీరియల్ తీసుకుని వారి ప్రాజెక్టులు సబ్మిట్ చేయాల్సి ఉండటం వల్ల దీర్ఘకాలం కంప్యూటర్ స్క్రీన్ల పైనే దృష్టి నిలపడంతో కంటి సమస్యలు ఈ సీజన్లో మరింత పెరుగుతున్నాయి. కంప్యూటర్స్, ట్యాబ్స్, ప్యాడ్స్, మొబైల్ ఫోన్స్.. ఇవన్నీ సమస్యల కారకాలే కాగా కంటి సమస్యల లక్షణాలు స్పష్టంగా కనపడతున్నాయి. పరీక్షల సమయం కదాని వీటిని నిర్లక్ష్యం చేస్తే అవి తీవ్రమైన దుష్పరిణామాలకు దారి తీస్తాయి. ఐస్ట్రెయిన్ నుంచి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ దాకా.. దీర్ఘకాలం పాటు ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు అతుక్కుపోయి ఉండటం కారణంగా ఈ సమస్య వస్తోంది. దీని వల్ల కళ్లు పొడిబారడం, దురద, ఎర్రబడటం, మంటగా ఉండటం వంటి సమస్యలు వస్తాయి. తద్వారా చూపు మసకబారుతోంది. దృష్టి నిలపడం కష్టతరమవుతోంది. నిద్రలేమి సమస్య రావచ్చు. తెలియని అలసట ఆవరిస్తుంది. దీర్ఘకాలం పాటు కంప్యూటర్ స్క్రీన్లపై నిలిపే దృష్టి, కళ్లను తరచూ అటూ ఇటూ తిప్పడం, వేగంగా ఇమేజెస్ మార్చి మార్చి చూడటం.. కంటి కండరాలను అలసటకు గురి చేస్తాయి. రెటీనా ఇబ్బందులు, కాటరాక్టస్ వగైరా సమస్యలకు కారణమవుతోంది. దీనినే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటున్నారు. మార్పులు చేర్పులు అవసరం.. కంప్యూటర్ స్క్రీన్‌లో బ్రైట్ నెస్, ఫాంట్ సైజ్ తగ్గించడం, మానిటర్ హైట్ కంటిచూపునకు తగ్గట్టు అమర్చుకోవడం, స్క్రీన్కు కళ్లకు మధ్య దూరం సరిచూసుకోవడం వంటి మార్పులు చేసుకోవాలి. ఆప్తమాలజిస్ట్కు చూపించుకుని అవసరమైతే కంటి అద్దాలు తప్పక ఉపయోగించాలి. అలాగే నిర్విరామంగా స్క్రీన్‌ను చూడకుండా ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్లు అనే 20–20–20 రూల్ ప్రకారం దృష్టిని మళ్లిస్తుండాలి. తరచూ కనురెప్పలు మూస్తూ తెరుస్తూ ఉండటం అలవాటు చేసుకోవాలి. అరచేతుల్ని రుద్ది వెచ్చగా మారాక మూసిన కళ్ల మీద పెట్టుకోవడం వంటి మసాజ్‌లు కూడా సహజమైన పద్ధతిలో ఉపకరిస్తాయి. సుదీర్ఘంగా స్క్రీన్‌ను చూడకుండా ప్రతి అరగంటకూ బ్రేక్ తీసుకోవాలి. -
సెల్‌ఫోన్ చెంత ఉంటే మెదడు డీలా
వాషింగ్టన్ : స్మార్ట్‌ఫోన్ వచ్చాక జీవితం సుఖమయం అయిందని అనిపిస్తోంది. కానీ, ఈ సౌఖ్యాల మాటున ప్రమాదాలూ పొంచి ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఫోన్ చెంతనే ఉంటే ఏకాగ్రత దెబ్బతింటుందని, మెదడు పనితీరును ప్రభావితం చేస్తుందని తాజా అధ్యయనంలో తేలిందట! యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు కొంతమంది వలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరీక్షలు జరిపి ఈ విషయాన్ని నిర్దారించుకున్నారు. ఇందులో భాగంగా 800 మంది మొబైల్‌ఫోన్ యూజర్లను ఎంపిక చేశారు. వలంటీర్ల పనితీరును, మొబైల్ అందుబాటులో ఉన్నపుడు (దానిని ఉపయోగించకపోయినా సరే) పనిలో, ఏకాగ్రతలో కలిగే మార్పులను పరిశీలించగా తాము ఈ విషయాన్ని గమనించినట్లు పరిశోధకులు వివరించారు. -
ఫోన్ పగలగొట్టిందని.. నాయనమ్మను చంపేశాడు!
వస్తువుల మీద మోజు పెరిగి.. మనుషులను దూరం చేసుకుంటున్నామని చాలా మంది చెబుతున్నారు. బెంగళూరులో సరిగ్గా ఇలాగే జరిగింది. తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పగలగొట్టిందన్న కోపంతో.. 90 ఏళ్ల నాయనమ్మను ప్లాంకుతో కొట్టి చంపేశాడు ఆమె మనవడు. బెంగళూరులోని కదిరెనహళ్లి ప్రాంతంలో ఉన్న తమ ఇంట్లో శివరాజ్ (22) అనే యువకుడు తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చార్జింగ్‌లో పెట్టాడు. అతడి నాయనమ్మ లక్ష్మమ్మ (90)కు కంటిచూపు సరిగా ఉండదు. దాంతో ఆమె చూసుకోకుండా ఆ ఫోన్‌కు తగలడంతో అది కాస్తా కింద పడింది. ఆ ఫోను స్క్రీన్ ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. ఆ శబ్దం విన్న శివరాజ్ లోపలి నుంచి పరుగున అక్కడకు వచ్చాడు. వెంటనే కోపంతో చెక్క ప్లాంకు తీసుకుని నాయనమ్మ మెడమీద కొట్టాడు. దాంతో ఆమె తీవ్రమైన నొప్పితో కుప్పకూలిప ఓయారు. ఎందుకలా కొట్టావని కుటుంబ సభ్యులు అతడిని తిట్టారు. అనంతరం లక్ష్మమ్మను బెడ్రూంలోకి తీసుకెళ్లి, ఆమెను నెమ్మదిగా పడుకోబెట్టారు. మర్నాడు ఉదయం లక్ష్మమ్మను ఎంత లేపినా ఆమె లేవలేదు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి, శివరాజ్‌ను అరెస్టు చేశారు.