అమెరికా ఎంబసీకి సమీపంలో ఆత్మాహుతి దాడి | Huge Blast in Afghanistan's Kabul Near Busy Shopping District | Sakshi
Sakshi News home page

అమెరికా ఎంబసీకి సమీపంలో ఆత్మాహుతి దాడి

Published Tue, Jun 30 2015 3:19 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

అమెరికా ఎంబసీకి సమీపంలో ఆత్మాహుతి దాడి

అమెరికా ఎంబసీకి సమీపంలో ఆత్మాహుతి దాడి

కాబూల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. కాబూల్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం   ఆత్మాహుతి దాడి జరిగింది.  కారు బాంబుద్వారా దుండగుడు తనను తాను పేల్చుకుని బీభత్సం సృష్టించడంతో  భయంకరమైన  పేలుడు సంభవించింది.  బాగా రద్దీగా ఉండే  ప్రదేశంలో ఒక్కసారిగా   జరిగిన పేలుళ్లతో  తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. యూస్ రాయబార కార్యాలయానికి, ఆఫ్గాన్ సుప్రీంకోర్టుకు సమీపంలోని  ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.   విదేశీ దళాలను టార్గెట్ గా హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ మార్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం.  దీంతో  సంఘటనా స్థలమంతా నల్లని పొగ అలుముకుంది. పోలీస్ వాహనాలు, అంబులెన్స్ భారీ ఎత్తున మోహరించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి.

రంజాన్  ఉపవాస దీక్ష సందర్భంగా ఉద్యోగులందరూ ఆఫీసు నుంచి తొందరగా వెళ్లడంతో పెద్ద ప్రమాదం  తప్పిందని అధికార వర్గాలు వెల్లడించాయ. దీని వెనుక కారణాలు  ఇంకా తెలియాల్సి ఉందని సీనియర్ పోలీసు అధికారులు  తెలిపారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement