పోలీసులను చెడామడా తిట్టిన సింగర్‌ | Ice Cube Blasts Officers in New Song ‘Good Cop Bad Cop’ | Sakshi
Sakshi News home page

పోలీసులను చెడామడా తిట్టిన సింగర్‌

Published Fri, Jun 9 2017 12:54 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

పోలీసులను చెడామడా తిట్టిన సింగర్‌

పోలీసులను చెడామడా తిట్టిన సింగర్‌

న్యూయార్క్‌: అమెరికన్‌ రాప్‌ సింగర్‌, యాక్టర్‌ ఐస్‌ క్యూబ్‌ పోలీసులపై విరుచుకుపడ్డాడు. చెడామడా ఏకిపారేశాడు. తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసే దుర్మార్గాలని ఎండగట్టాడు. అయితే ఇదంతా నిజంగా కాదు. ఐస్‌క్యూబ్‌ లేటెస్ట్‌ ఆల్బంకు సంబంధించిన సంగతి ఇది.

ఐస్‌ క్యూబ్‌ లేటెస్ట్‌ ఆల్బం డెత్‌ సర్టిఫికేట్ 25 ఎడిషన్‌‌. ఇందులో ’గుడ్‌ కాప్‌ బ్యాడ్‌ కాప్‌’ పేరుతో ఉన్న ఓ సాంగ్‌లో నల్లజాతీయులపై పోలీసుల దాష్టికంపై ఐస్‌ క్యూబ్‌ విరుచుకుపడ్డాడని బిల్‌బోర్డ్‌ మేగజైన్‌ వెల్లడించింది. ఐస్‌ క్యూబ్‌ సాంగ్‌పై కొంత వ్యతిరేకత వ్యక్తమౌతున్నా.. దీనిని వేదికలపై ప్రదర్శిచడంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నాడు. ఐస్‌క్యూబ్‌.. డెత్‌ సర్టిఫికేట్‌ 25 ఎడిషన్‌ ఈ నెలలోనే విడుదలవుతోంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement