ఎదురు కట్నం ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్! | Imran Khan weds TV anchor in a simple ceremony | Sakshi

ఎదురు కట్నం ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్!

Jan 9 2015 3:50 AM | Updated on Sep 2 2017 7:24 PM

ఇమ్రాన్ ఖాన్ - రెహమ్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్ - రెహమ్ ఖాన్

రాజకీయ నేతగా మారిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ బీబీసీ టీవీ యాంకర్ రెహమ్ ఖాన్ను రెండవ పెళ్లి చేసుకున్నారు.

ఇస్లామాబాద్: రాజకీయ నేతగా మారిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ బీబీసీ టీవీ యాంకర్  రెహమ్ ఖాన్ను గురువారం రెండవ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఇస్లామాబాద్ శివారులోని  పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ బానీ గాలా ఫామ్ హౌస్లో  నిరాడంబరంగా జరిగింది.  ముస్లిం సాంప్రదాయం ప్రకారం ముఫ్తీ సయీద్ ఈ నిఖాని నిర్వహించారు.

సన్నిహిత మిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ నిఖాకు హాజరయ్యారు. ఈ వివాహం సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ లక్ష రూపాయలు ఎదురు కట్నం ఇచ్చారు. అత్యధిక మంది ఇమ్రాన్(62),రెహమ్(42)ల పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement