ఎదురు కట్నం ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్!
ఇస్లామాబాద్: రాజకీయ నేతగా మారిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ బీబీసీ టీవీ యాంకర్ రెహమ్ ఖాన్ను గురువారం రెండవ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఇస్లామాబాద్ శివారులోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ బానీ గాలా ఫామ్ హౌస్లో నిరాడంబరంగా జరిగింది. ముస్లిం సాంప్రదాయం ప్రకారం ముఫ్తీ సయీద్ ఈ నిఖాని నిర్వహించారు.
సన్నిహిత మిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ నిఖాకు హాజరయ్యారు. ఈ వివాహం సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ లక్ష రూపాయలు ఎదురు కట్నం ఇచ్చారు. అత్యధిక మంది ఇమ్రాన్(62),రెహమ్(42)ల పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు.