లండన్: హాట్ ప్రాపర్టీ మార్కెట్‌గా పేరొందిన లండన్‌లో స్థిరాస్తుల కొనుగోళ్లలో భారతీయులు ముందున్నారు. లండన్ ప్రాపర్టీ లావాదేవీల్లో భారతీయులు టాప్ 2గా నిలిచి స్థిరాస్తులు సొంతం చేసుకోవడంపై తమ క్రేజ్‌ను చాటుకున్నారు.బ్రెగ్జిట్ పరిణామాలు, ట్రంప్ వివాదాస్పద నిర్ణయాల ప్రభావం ఇవేమీ ఆస్తుల కొనుగోలులో మనవాళ్ల ఆసక్తిని దెబ్బతీయడం లేదు. 2016 ఆగస్ట్ నుంచి జులై 2017 మధ్య ప్రైమ్ సెంట్రల్ లండన్‌లో జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో 22 శాతం భారతీయులవేనని ప్రాపర్టీ కన్సల్టెన్సీ క్లట్టన్స్ అథ్యయనం వెల్లడించింది. రియల్ లావాదేవీల్లో ప్రతి ఐదింట ఒకటి భారతీయులదేనని, 18 బిలియన్ పౌండ్ల వ్యాపారంలో 4 బిలియన్ పౌండ్ల లావాదేవీలు భారతీయులవని సంస్థ పార్టనర్, రీసెర్చి హెడ్ పైసల్ దుర్రాని చెప్పారు.
ఐదేళ్ల కిందట సెంట్రల్ లండన్‌లో భారతీయుల ప్రాపర్టీ పెట్టుబడులు 5 శాతం నుంచి 2017లో 22 శాతానికి పెరిగాయని రియల్ ఎస్టేట్ సేవలు అందించే కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్స్ పేర్కొంది. గతంలో యూఎస్ డాలర్లలో లండన్‌లో ఆస్తులు కొనుగోలుచేసిన వారు ప్రస్తుత మారకపు విలువ ఆధారంగా భారీగా లాభపడుతన్నారని, ఆస్తుల కొనుగోళ్లకు ఫారెన్ ఎక్స్ఛేంజ్ వ్యత్యాసాలు కూడా భారతీయులకు కలిసివస్తున్నాయని క్లట్టన్స్ సంస్థ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment