
‘ట్రంప్’ ఐఫోన్ కోటి!
లండన్: బంగారంతో పొదిగిన, కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖచిత్రం ఉన్న ఐఫోన్ మార్కెట్‌లో కోటి రూపాయలకు అమ్మకానికి ఉంది. ఈ ఫోన్‌ను గోల్డ్‌జెనీ అనే సంస్థ తయారుచేసిందని సీఎన్ఎన్ మనీ తెలిపింది. కొద్ది రోజుల క్రితం దుబాయ్‌లోని సంస్థ స్టోర్‌లోకి ఓ చైనా మహిళ వెళ్లి ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజున బహుమతిగా ఇచ్చేందుకు ఆయన ముఖంతో కూడిన పరికరం కావాలని అడగటంతో ఇలాంటి వస్తువుల అమ్మకం ప్రారంభమైందని న్యూజెనీ ఎండీ ఫెర్నాండో వివరించారు. ఆ తరువాత వజ్రాలతో పొదిగిన ట్రంప్ ముఖమున్న ఐఫోన్లను గోల్డ్‌జెనీ తొమ్మిందింటిని అమ్మింది.