ఆ కంచుకోటలో ఇంటర్నెట్పై నిషేధం
బీరుట్: సిరియాలోని తన కంచుకోట రఖాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రై వేట్‌గా ఇంటర్‌నెట్ వాడకంపై నిషేధం విధించింది. ప్రజలే కాకుండా ఐఎస్ ఉగ్రవాదులు సైతం తమ పర్యవేక్షణలోని ఇంటర్‌నెట్ కేఫ్‌లలోనే ఇంటర్‌నెట్‌ను వినియోగించుకునేలా ఆంక్షలు విధించింది. ప్రై వేట్ వైఫై కనెనక్షన్లను నాలుగు రోజుల్లోగా తొలగించాలని ఆదేశిస్తూ ఐఎస్ ఆదివారం కరపత్రాలను కూడా పంపిణీ చేసిందని ఈ మేరకు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్, యాక్టివిస్ట్ గ్రూప్ రఖా సంస్థలు వెల్లడించాయి.
ఇంటర్‌నెట్ కేఫ్‌లలో మినహాయించి ఇతర అన్ని వ్యక్తిగత ప్రదేశాల్లో, ఐఎస్ ఫైటర్లకు కూడా వైఫై సేవలను ఆపివేయాలని ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించినట్లు తెలిపాయి. ఇలాంటి ఆంక్షలతో తమ రెండు సంస్థలను నిరోధించాలని ఐఎస్ ప్రయత్నిస్తోందని హక్కుల సంస్థలు పేర్కొన్నాయి. ఇంటర్‌నెట్ కేఫ్‌లపై దాడులు చేస్తూ, వార్తలు పంపేవారిపై నిఘా పెడుతున్నారని, సిరియాయేతర ఐఎస్ ఫైటర్లు తిరిగి వెళ్లిపోతారన్న భయంతో వారిని కుటుంబసభ్యులతో ఫోన్‌లో సైతం మాట్లాడనీయడం లేదని వెల్లడించాయి.