ప్రళయం కాదు..
ఇదేంట్రా బాబు భూమి రెండుగా చీలిపోతోందేంటనుకుంటున్నారా.. అయితే మీరు మంచులో కాలేసినట్లే... జాగ్రత్తగా చూడండి అది గడ్డకట్టిన సరస్సు.. చలికాలంలో మైనస్ 19 డిగ్రీల ఉష్ణోగ్రతలుండే ఈ సరస్సుపై గడ్డ కట్టిన భాగం కొన్ని వందల మీటర్ల మేర చీలిపోయింది.
రష్యాలో ఉన్న ఈ సరస్సు పేరు బైకాల్.. ప్రపంచంలోని మంచినీటి సరస్సుల్లో ఇదే అతిపెద్దది. మరో విశేషమేమంటే.. భూమిపై ఉన్న మంచినీటిలో దాదాపు 20 శాతం నీరు ఈ ఒక్క సరస్సులోనే ఉంటుందట.