ఐఎస్‌ఐ చీఫ్‌గా ఫైజ్‌ హమీద్‌ | Lt Gen Faiz Hameed Named New ISI Chief | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఐ చీఫ్‌గా ఫైజ్‌ హమీద్‌

Published Mon, Jun 17 2019 10:42 AM | Last Updated on Mon, Jun 17 2019 10:42 AM

Lt Gen Faiz Hameed Named New ISI Chief - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ)కు నూతన అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫైజ్‌ హమీద్‌ను నియమిస్తున్నట్లు పాక్‌ ఆర్మీ తెలిపింది. ప్రస్తుత ఐఎస్‌ఐ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. మునీర్‌ను గుజ్రన్‌వాలా కోర్‌ కమాండర్‌గా నియమించినట్లు పేర్కొంది. ఫైజ్‌ హమీద్‌ గతంలో ఐఎస్‌ఐ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ వింగ్‌లో పనిచేసినట్లు సమాచారం.

లెఫ్టినెంట్‌ జనరల్‌ నవీద్‌ ముక్తార్‌ రిటైర్‌ కావడంతో మునీర్‌ను గతేడాది అక్టోబర్‌లో ఐఎస్‌ఐ చీఫ్‌గా నియమించారు. మామూలుగా ఈ పదవిలో మూడేళ్లు కొనసాగే వీలుంది. కానీ మునీర్‌ ఎందుకు ముందుగానే తప్పించారనేది వెల్లడికాలేదు. ఇంకా పలువురు ఉన్నతాధికారులకు స్థాన చలనం కల్పించినట్టు పాక్‌ ఆర్మీ ప్రకటించిదని స్థానిక మీడియా తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement