ISI chief
-
బిల్‌గేట్స్‌తో ఫొటో.. బిల్డప్‌కు పోయి నవ్వులపాలయ్యాడు
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. బిల్డప్ కొట్టేందుకు బిల్‌గేట్స్‌తో ఉన్న ఓ ఫొటోను షేర్ చేయగా.. అందులోని ఓ పాయింట్‌తో పాక్ ప్రధానిని ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన బిల్‌గేట్స్.. తాజాగా పాక్‌లో పర్యటించారు(ఆయన పాక్‌లో పర్యటించడం ఇదే ఫస్ట్ టైం). ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తన కేబినెట్లోని మంత్రులు, కీలక విభాగాధిపతులతో కలిసి బిల్‌గేట్స్‌తో లంచ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను పాక్ పీఎంవో ట్విటర్లో పోస్ట్ చేసింది. అయితే అందులో అంతా ఓ వ్యక్తి వైపు తిరగ్గా.. అక్కడ ఎవరూ లేకపోవడం ఫొటోకి హైలెట్ అయ్యింది. పాక్ న్యూస్ ఏజెన్సీ ది కరెంట్ కథనం ప్రకారం.. అక్కడ ఉంది ఐఎస్ఐ(Inter-Services Intelligence) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్. అతన్ని ఫొటోగానీ, వీడియోలు తీయడానికి ఇంటెలిజెన్స్ సర్వీస్ అంగీకరించదు. ఒక్కపక్క నదీమ్ ఐడెంటిటీని రివీల్ చేయడం ఇష్టం లేని పాక్ ప్రభుత్వం.. మరోపక్క బిల్‌గేట్స్‌తో ఉన్న ఫొటోను ఎలాగైనా షేర్ చేయాలని ఉవ్విళ్లూరింది. తద్వారా పాక్ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు చర్చలు జరుపుతున్నట్లు ప్రతిపక్షాలకు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఫొటో షాప్‌లో ఐఎస్ఐ చీఫ్ ఫొటోను ఎగరకొట్టేయడం, అందరూ నదీమ్ వైపే చూస్తుండడంతో.. ఈ ఫొటో వంకతో ఇమ్రాన్ ఇజ్జత్ తీసేస్తున్నారు పాక్ నెటిజన్లు. Prime Minister @ImranKhanPTI's luncheon in honor of @BillGates Mr. Bill Gates is visiting Pakistan at the special invitation of the Prime Minister. pic.twitter.com/zSYNI6ddki — Prime Minister's Office, Pakistan (@PakPMO) February 17, 2022 గత అక్టోబర్‌లో నదీమ్.. ఐఎస్ఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో ఆర్మీ మీడియా వింగ్ మొదట నదీమ్ పేరును ప్రకటించింది. ఆ తర్వాతే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఖాన్ పాలనలో మిలిటరీ జోక్యం ఎక్కువైందని, ఫారిన్-మిలిటరీ పాలసీలను సైతం ప్రభావితం చేస్తున్నాయనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. చదవండి: ఇమ్రాన్‌ఖాన్ ది ఇంటర్నేషనల్ బెగ్గర్ -
ఐఎస్ఐ చీఫ్‌గా ఫైజ్ హమీద్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కు నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను నియమిస్తున్నట్లు పాక్ ఆర్మీ తెలిపింది. ప్రస్తుత ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. మునీర్‌ను గుజ్రన్‌వాలా కోర్ కమాండర్‌గా నియమించినట్లు పేర్కొంది. ఫైజ్ హమీద్ గతంలో ఐఎస్ఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్‌లో పనిచేసినట్లు సమాచారం. లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముక్తార్ రిటైర్ కావడంతో మునీర్‌ను గతేడాది అక్టోబర్‌లో ఐఎస్ఐ చీఫ్‌గా నియమించారు. మామూలుగా ఈ పదవిలో మూడేళ్లు కొనసాగే వీలుంది. కానీ మునీర్ ఎందుకు ముందుగానే తప్పించారనేది వెల్లడికాలేదు. ఇంకా పలువురు ఉన్నతాధికారులకు స్థాన చలనం కల్పించినట్టు పాక్ ఆర్మీ ప్రకటించిదని స్థానిక మీడియా తెలిపింది. -
‘ది స్పై క్రానికల్’ రచయితకు పాక్ ఆర్మీ సమన్లు
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఐఎస్ఐ(ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్) మాజీ చీఫ్ అసద్ దురాణి రచించిన ‘ది స్పై క్రానికల్: రా, ఐఎస్ఐ అండ్ ది ఇల్యూషన్ ఆఫ్ పీస్’ పుస్తకం వివాదస్పదమవుతోంది. ఈ నెల 28న పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో హాజరు కావాల్సిందిగా పాకిస్తాన్ ఆర్మీ అసద్‌కు సమన్లు జరిచేసింది. పుస్తకంలో ఆయన పొందుపర్చిన విషయాలు ‘వైలెటింగ్ ది మిలటరీ కోడ్ ఆఫ్ కండక్ట్’ కిందకు వస్తాయని పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తెలిపారు. ఈ నెల 28న జనరల్ హెడ్‌క్వార్టర్స్‌కు రావాల్సిందిగా అసద్‌కు గత శుక్రవారం సమన్లు జారీ చేసినట్టు వెల్లడించారు. ఇండియాస్ రిసెర్చ్ అండ్ అనాలసీస్ వింగ్ మాజీ చీఫ్ ఏఎస్ దులట్తో కలిసి అసద్ ది స్పై క్రానికల్ పుస్తకాన్ని రచించారు. ఇద్దరు రచయితలు ఇండియా, పాకిస్తాన్‌కు సంబంధించిన విషయాలను చర్చిస్తున్నట్టు పుస్తకంలో పొందుపర్చారు. అయితే పుస్తకంలో పేర్కొన్న విషయాలు ఆర్మీ నిబంధనలు ఉల్లఘించేలా ఉన్నాయని పాకిస్తాన్ ఆర్మీ అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా అసద్‌కు సమన్లు జారీ చేసింది. పుస్తకంలో పేర్కొన్న ముఖ్యమైన, వివాదస్పదమైన అంశాలు ఇవి.. అమెరికా బలగాలు ఉగ్రవాద సంస్థ అల్ ఖైయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చెందుకు చేసిన ఆపరేషన్ పాకిస్తాన్‌కు తెలిసే జరిగిందని పుస్తకంలో పేర్కొన్నారు. భారత్‌కు చెందిన కులభుషన్ జాదవ్‌కు సంబంధించిన విషయాలను కూడా పేర్కొన్నారు. కశ్మీర్లో జరుగుతున్న అల్లర్లలో పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు కూడా పుస్తక సహా రచయిత అసద్ ఓ ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. -
ఐఎస్ఐ చీఫ్ మార్పు..?
ఇస్లామాబాద్: త్వరలో పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ రిజ్వాన్ అక్తర్ స్థానంలో మరొకరిని నియమించనున్నట్లు సమాచారం. మార్పు ప్రక్రియ జరుగుతున్నట్లు శనివారం ఓ మీడియా సంస్థ వెల్లడించింది. 2014 సెప్టెంబర్‌లో ఐఎస్ఐ డీజీగా అక్తర్ బాధ్యతలు స్వీకరించారు. ఐఎస్ఐ డీజీ పదవీ విరమణ పొందితేనో.. లేదా ఆ స్థానంలో ఆర్మీ చీఫ్ మరొకరిని నియమిస్తేనో తప్ప.. ఐఎస్ఐ చీఫ్‌ను మూడేళ్ల పదవీ కాలానికి నియమిస్తారు. అయితే తాజా కథనం ప్రకారం అక్తర్ తన పదవీ కాలం కన్నా ముందుగానే బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అక్తర్ స్థానంలో కరాచీ సైనిక దళం కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ నవీద్ ముఖ్తార్‌ను నియమించనున్నట్లు అధికారులు తెలిపారని మీడియా సంస్థ వెల్లడించింది. అయితే దీన్ని పాక్ మిలటరీ ప్రతినిధి బజ్వా కొట్టిపారేశారు. కథనాన్ని ప్రచురించిన మీడియా సంస్థ కూడా.. ఐఎస్ఐ చీఫ్‌ను ఎందుకు మార్చుతారనే విషయాన్ని ప్రస్తావించలేదు.