ఫేస్‌బుక్ అకౌంట్ లేకుండా మెసెంజర్
న్యూయార్క్: ఇకపై మెసెంజర్ యాప్‌కి ఫేస్‌బుక్ అకౌంట్ అవసరం లేని సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ తెలిపింది. ఫేస్‌బుక్ యాప్ వృద్ధిని మెసెంజర్ అడ్డుకుంటోందని సంస్థ భావించడమే ఈ నిర్ణయానికి కారణం. ప్రస్తుతానికి మెసెంజర్.. యాప్ నుంచి పూర్తిస్థాయి ప్లాట్‌ఫామ్‌గా రూపాంతరం చెందింది. ఇప్పటికే మెసెంజర్ యాప్ కోసం 40 అప్లికేషన్‌లను ప్రకటించారు. ఏప్రిల్‌లో వీడియో కాలింగ్ ప్రవేశపెట్టిన తర్వాత ఇటీవలే మెసెంజర్‌పై ఓ గేమ్‌ను కూడా అందిస్తోన్న విషయం తెలిసిందే.
దీంతో ఫేస్‌బుక్, మెసెంజర్‌లను వేర్వేరుగా అందించాలని సంస్థ భావిస్తోంది. తొలుత ఫేస్‌బుక్‌లో సందేశాలు పంపించాలంటే మెసెంజర్ యాప్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని నిబంధన విధించడంతో.. బలవంతంగానే వినియోగదారులు మెసెంజర్‌ని ఇన్‌స్టాల్ చేయాల్సివచ్చింది.