భారతీయులు అమెరికా వెళ్లడం ఇక సులువు | MoU signed to facilitate hassle-free entry of Indians into US | Sakshi
Sakshi News home page

భారతీయులు అమెరికా వెళ్లడం ఇక సులువు

Published Sat, Jun 4 2016 10:41 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

భారతీయులు అమెరికా వెళ్లడం ఇక సులువు - Sakshi

భారతీయులు అమెరికా వెళ్లడం ఇక సులువు

వాషింగ్టన్: కొన్ని నిర్దేశిత విమానాశ్రయాల్లో స్వల్ప తనిఖీలతో భారతీయులు సులువుగా అమెరికాలో ప్రవేశించేందుకు ఇరు దేశాలూ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. పెద్దగా తనిఖీలు అవసరం లేని ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఇలాంటి వారికి భద్రతాపరమైన అనుమతులను త్వరగా మంజూరు చేస్తారు. ఇందుకోసం అమెరికాతో ‘గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్’ ఒప్పందం కుదుర్చుకున్న తొమ్మిదో దేశం భారత్ అని అమెరికా అధికారులు తెలిపారు. ఈ మేరకు అమెరికాలో భారత రాయబారి అరుణ్ సింగ్, అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ డిప్యూటీ కమిషనర్ మధ్య కెవిన్ మెక్ అలీనన్ మధ్య ఎంఓయూ కుదిరింది. ఈ కార్యక్రమం అమలుకు కొన్ని నెలల సమయం పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement