నేపాల్‌లో బలైన మూగ జీవులు
నేపాల్: ప్రకృతి విలయం దెబ్బకు ప్రాణాలు కోల్పోయిన పశువులు కావివి. మానవుని అనాగరిక నమ్మకాలకు బలైపోయిన మూగ జీవులు. శుక్రవారం నేపాల్‌లోని బారా జిల్లాలో ఐదేళ్లకోసారి జరిగే ‘గడిమాయ్ పర్వ్’ ఉత్సవంలో భాగంగా ఇలా వేలాది జంతువులను బలి ఇచ్చారు. జంతు బలితో మంచి జరుగుతుందని నమ్మి ఏటా దాదాపు ఐదు లక్షల జంతువులను ఇలా చంపేయడం ఇక్కడి ఆచారం. ఇంతటి భారీ స్థాయిలో జంతు బలులు జరిగే వేడుక ప్రపంచంలో మరోటి లేదు.