dumb creatures
-
అనాథ జీవాలకు అమ్మా.. నాన్న
సాటి మనిషికి సాయం చేయలేని మనుషులున్న నేటి రోజుల్లో మూగజీవాలను కూడా ప్రేమతో...అక్కున చేర్చుకుంటున్నారు.. ఆకలితో ఉన్న జీవాలకు ఆపన్నహస్తంగా ఆహారం పంపిణీ చేస్తున్నారు.. వారి ఇంటి దరిదాపుల్లో వివిధ జాతుల ఆవులు, దూడలు, కుక్కలు, పిల్లులు, కోతులు, కాకులు.. ఇలా ఒక్కటేమిటి..ఎన్నో మూగ జీవాలు చూపరులను అబ్బురపరుస్తాయి. అటుగా వెళ్లేవారికి ఆ మూగజీవాలు తారసపడుతుంటాయి. వీటిని అక్కున చేర్చుకున్న వారే కూకట్‌పల్లికి చెందిన మణికొండ దేవేందర్‌రావు, రమాదేవి దంపతులు. ఇదంతా వీరు గుర్తింపు కోసమో.. లేక వ్యాపారం కోసమో అనుకుంటే పొరపాటే.. వారికి తెలిసిందల్లా ఒక్కటే.. వాటికి నిస్వార్థంగా సేవ చేయడమే.. – తొట్ల పరమేష్ఆపదలోని మూగ ప్రాణులకు ఆపన్నహస్తంఅక్కున చేర్చుకుని ఆహారం పంపిణీ వందల సంఖ్యలో జీవాలకు సేవ నవ సేవే.. మాధవ సేవ.. ఇది అందరికీ తెలిసిన నానుడి. కానీ సర్వ ప్రాణి సేవయే మాధవ సేవ అన్నది వారి పంథా. ఔను..భువిపై తనకు మాత్రమే హక్కు అన్నట్లు జీవుడు విర్రవీగుతుంటాడు. కానీ ఇలపై మనిషి ఎలాగో అన్ని ప్రాణులకూ జీవించే హక్కు ఉందంటూ వారు నినదిస్తున్నారు. ఆపై సేవకు అంకితమయ్యారు. ఒకటి కాదు..రెండు కాదు..వందల సంఖ్యలో మూగ జీవాలను అక్కున చేర్చుకుని కన్న బిడ్డల మాదిరిగా సాకుతున్నారు. మనిషికి మనిషే బరువైన ప్రస్తుత సమాజంలో ప్రతి ప్రాణినీ తన బిడ్డగా భావిస్తూ నిస్వార్థ సేవకు నిర్వచనం.. కూకట్‌పల్లికి చెందిన మణికొండ దేవేందర్‌రావు, రమాదేవి దంపతులు. వీరితోపాటు వీరి ఇద్దరి బిడ్డలు సాఫ్ట్వేర్ ఉద్యోగులైనా కూడా మూగ జీవాల సేవలో తరిస్తున్నారు. జీవాలకూ సొంత పేర్లు...వీరి ఇంటి దరిదాపుల్లో వెళ్లిన వారికి కొన్ని పేర్ల పిలుపులు వినిపిస్తుంటాయి.. కొత్తగా వినేవారికి ఎవరి కోసమో వెతుకుతున్నారని పొరపడతారు.. కానీ, వారు పిలిచేది మూగజీవాలని తెలిశాక ఆశ్చర్యపోక మానరు... ‘ఏయ్ లక్ష్మీ ఇటు రావే..ఓయ్ శివా అటు వెళ్లరా..!’ ఎలాగైతే మనం సాటి మనుషులతో మాట్లాడతామో! అలాగే వారు మూగ జీవాలతో మాట్లాడుతుంటారు. వాటికి పేర్లు పెట్టడమే కాదు..ఆ పేరుతో పిలిస్తే అవి కూడా ఠక్కున అలెర్ట్ అయ్యి వారు చెప్పింది చేసేస్తాయి. మమకారం చూపించాలే గానీ మూగ జీవాలు అంతకంటే ఎక్కువ వాత్సల్యాన్ని చూపిస్తాయని ఆ దంపతులు నిరూపిస్తున్నారు. పేరు పెట్టి వారు రమ్మంటే వచ్చేస్తాయి.. వెళ్లు అంటే వెళ్లిపోతాయి..తిను అంటే తినేస్తాయి..ఇక చాలు అంటే ఆపేస్తాయ్..అంతగా మూగ జీవాలతో వారికి బాండింగ్ ఏర్పడింది.పక్కాగా టైం పాటిస్తూ.. మూగ జీవాలకు ఆహారంతో పాటు ప్రేమాప్యాయతలు కలగలిపి వడ్డిస్తారో ఏమో గానీ ఎక్కడున్నా సరే..రోజూ పక్కాగా టైం ప్రకారం వీరి వద్దకు వచ్చేస్తాయి. ఒక్క కాకులు, పావురాలే కాదు ఆవులు, కుక్కలు, పిల్లులు, కోతులు వాటికి నిర్దేశించిన సమయాల్లో వచ్చి వీరి రోజువారీ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్తుంటాయి. ఇలా ఉదయం 6–7 గంటలకు ప్రారంభమయ్యే మూగ జీవాల రాక సాయంత్రం 7 గంటల వరకూ కొనసాగుతుంటుంది. ఉదయం6–7 గంటల మధ్య కాకులు, 9 గంటలకు పావురాలు, 10 గంటలకు ఆవులు, మధ్యాహ్నం 3 గంటలకు కుక్కలు, సాయంత్రం పిల్లులు..ఇలా ఒక్కో సమయంలో ఒక్కో మూగ జీవాలు ఇక్కడకు వచి్చపోతుండడం గమనార్హం.ఆవుల గైనిక్..రమాదేవిఆవుల ప్రసవానికి వచ్చాయంటే జీహెచ్ఎంసీలో గుర్తుకొచ్చే వైద్యురాలు రమాదేవి. తమ వద్దకు వచ్చే ఆవులతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని గోశాలల్లో ఎక్కడైనా సరే ఆవులు ఈతకు వచ్చాయంటే ఆమెనే దగ్గరుండి ప్రసవం చేస్తారు. భుమి మీదకు వచ్చే ఆవు దూడపై మొదట తన చేతులు పడాల్సిందే.. ఒకరకంగా ఆమె ఆవులకు గైనిక్గా మారిపోయారు.లేగ దూడలకు ప్రత్యేక బెడ్మూగ జీవాల ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ వాటికి సపర్యలు చేస్తుంటారు. వాటిని తనకుటుంబ సభ్యులు, పిల్లల మాదిరిగానే బెడ్ మీద పడుకోబెట్టి సేవలందిస్తారు. ఓసారి 20 రోజుల లేగదూడకు యాక్సిడెంట్ అయ్యి కాలు విరగటంతో విషయం తెలుసుకున్న రమాదేవి రహదారి వద్దకు వెళ్లి దానిని ఆటోలో తీసుకొచ్చి అక్కడ నుంచి పశువుల ఆస్పత్రికి తరలించారు. అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో మూడు గంటల పాటు వేచి ఉండి డాక్టర్‌ను పిలిపించి చికిత్స చేయించిన అనంతరం రమాదేవి భర్త దేవేందర్‌రావు ఆ లేగ దూడను తన బెడ్‌పై పడుకోబెట్టి ఆహారంలో మాత్రలు, ఇంజక్షన్లు ఇచ్చి రెండు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మరణించిన వాటికి అంత్యక్రియలుదెబ్బతగిలిన లేగదూడ కొద్ది రోజుల తరువాత మూర్చ వ్యాధితో చనిపోయింది. దాంతో మనస్తాపానికి గురైన వారు లేగదూడను బహిర్భూమిలో వదిలివేయకుండా మనుషులకు చేసిన విధంగానే లేగ దూడకు అంత్యక్రియలు నిర్వహించి కొద్ది రోజుల పాటు ఆ దంపతులు దిగులుతో రెండు మూడు రోజులు ఆహార పానీయాలు కూడా ముట్టలేదు. ఈ విధంగా మూగ జీవాలతో వారి అనుబంధం కొనసాగింది. కుక్కలకు కూడా ఏ చిన్న దెబ్బ తాకినా వాటికి చికిత్స చేయించి మందులు ఇవ్వటం వారికి అలవాటుగా మారింది. కాంక్రీట్ జంగిల్లోనూ కావ్..కావ్..జాడ పితృ దేవతలకు ప్రతీకగా కాకులను విశ్వసిస్తారు. అలాంటి కాకులను కాంక్రీట్ జంగిల్లో భూతద్దం పెట్టి మరీ వెతికినా కనిపిస్తాయో లేదో తెలియదు. కనుమరుగు అయిపోతున్నాయి అనుకుంటున్న కాకులు సైతం రోజూ ఠంచనుగా ఒకే సమయంలో వీరి ముంగిట వాలిపోతుంటాయి. వారు అందించే ఆహారాన్ని ఆరగించి వెళ్లిపోతుండడం ఇక్కడ నిత్యకృత్యమే.ఐదేళ్ల క్రితం ప్రారంభమై... ఐదేళ్ల క్రితం మాట.. రెండు మూడు ఆవులతో ప్రారంభమై రోజులు గడిచే కొద్దీ ఆవుల సంఖ్య పెరిగింది. వీటికి తోడుగా కుక్కలు, పిల్లలు, కోతులు, కాకులు, పావురాలు.. ఇలా 70 వరకూ ఆవులు, 40 వరకు కుక్కలు, 15 వరకు పిల్లులు, 15 వరకు కాకులు, మరెన్నో పావురాలు వచ్చిపోతున్నాయి. అయితే ఇటీవల కోతులు కూడా వచ్చేవి. కానీ కుక్కల భయంతో అవి రావడం మానేశాయి.నెలకు లక్షన్నర ఖర్చు..మూగ జీవాలకు ఆహారం కోసం నెలకు లక్షన్నర వరకూ ఖర్చు చేస్తున్నారు. ఆవుల కోసం ప్రతిరోజూ రకరకాల కూరగాయలు, ఫలాలు, కుక్కల కోసం ఇంట్లో నాన్‌వెజ్ తినకపోయినప్పటికీ ప్రత్యేకంగా నాన్‌వెజ్ తెప్పించి పెడతారు. నెలకు నాలుగు క్వింటాళ్ల రైస్ మూగ జీవాల కోసం కొనుగోలు చేస్తుంటారు. -
తీరిన మూగవేదన
కడప అగ్రికల్చర్: నాడు అత్యవసర వైద్య సేవ లకు కోసం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 108 అంబులెన్స్‌ను అందుబాటులోకి తెచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నోరు లేని మూగజీవాల వైద్య సేవల కోసం 1962 వాహనాన్ని తెచ్చి చరిత్రపుటల కెక్కనున్నారు. పశువులు వ్యాధుల బారిన పడితే 1962కు కాల్ చేస్తే ఎక్కడ వైద్య సేవలవసరమో అక్కడికే వాహనం రానుంది. ఈ అంబులెన్స్‌లో పశుసంవర్ధశాఖకు సంబంధించిన పశుౖవైద్యుడు, వెటర్నరీ అసిస్టెంట్, అటెండర్ కమ్ డ్రైవర్ ఉంటారు. రైతు సమాచారం అందించగానే వారు సంఘటన స్థలానికి వెళ్లి వైద్య సేవలు అందించేలా రూపకల్పన చేశారు. అలాంటి వాహనాలు జిల్లాకు 7 అందుబాటులోకి రానున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. నియోజక వర్గానికి ఒకటి చొప్పున.. జిల్లాకు సంబంధించి వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా పథకం కింద ఏడు వాహనాలు రానున్నాయి. వీటి ద్వారా ఆయా నియోజకవర్గ కేంద్రంలోని పశుసంవర్థశాఖ ఏడీ పర్యవేక్షణలో సేవలు అందనున్నాయి. మూగజీవాల ఆరోగ్యానికి భరోసా వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ ద్వారా గ్రామాల్లోనే పశువులకు మెరుగైన వైద్యాన్ని అందించనున్నారు. అన్నదాతలను అదుకోవడమే లక్ష్యంగా త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 1962 వాహనాలను ప్రారంభించనున్నారు. జిల్లావ్యాప్తంగా 3.99 లక్షల గేదెలు ఉండగా అందులో 2.50 లక్షలు పాడిపశువులు, 13.56 లక్షల గొర్రెలు ఉన్నాయి. 11 లక్షలు కోళ్లు కూడా ఉన్నట్లు పశువైద్య అధికారులు తెలిపారు. ఈ మొబైల్ వాహనంతో మూగ జీవాల ఆరోగ్యానికి మరింత భరసా లభించనుంది. వైద్య సేవలు పొందేదిలా.. 108 తరహాలో 1962 నంబర్‌కు ఫోన్ చేయగానే పశువైద్యశాఖకు సంబంధించిన ప్రధాన కేంద్రానికి వెళుతుంది. అక్కడి నుంచి వారు రైతుకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటారు. దీంతోపాటు బాగాలేని పశువు, గెదె, మేక వంటి వాటి గురించి ఆరా తీసి సంబంధింత సమాచారాన్ని దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి చేరవేస్తారు.అక్కడ ఉన్న వైద్య సిబ్బంది వెళ్లి ప్రాథమికంగా పశువును పరీక్షించి వైద్య సేవలందిస్తారు. అత్యవసరమైతే అక్కడికి అంబులెన్స్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం దగ్గరలోని పెద్దాసుపత్రికి తరలిస్తారు. మే రెండవ వారంలో... జిల్లాలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ కింద మే రెండో వారంలో సేవలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించగానే జిల్లాకు వాహనాలు వస్తాయి. అప్పటి నుంచి జిల్లాలో కూడా సేవలు ప్రారంభిస్తాం. మూగ జీవాలకు ఆరోగ్యం సరిగా లేదని సమాచారం రాగానే వాహనం అక్కడికి వెళ్లి అక్కడికక్కడే సేవలు అందిచి అన్నదాతను ఆదుకుంటుంది. – తెలుగు. వెంకట రమణయ్య, జిల్లా పశు వైద్యాధికారి,వైఎస్సార్‌జిల్లా సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ అసుపత్రి: 01 వెటర్నరీ పాలిక్లినిక్: 01 ఏరియా వెటర్నీరీ హాస్పిటల్స్: 17 వెటర్నరీ డిస్షెన్సరీస్: 79 రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లు: 78 డివిజనల్ ఆఫీసర్లు: 03 పశు వైద్యులు: 117 వెటర్నరీ అసిస్టెంట్లు: 108 జిల్లాలో ఆర్బీకేలు : 414 -
చిక్కని చిరుత
సాక్షి, మెదక్‌జోన్: రెండు సంవత్సరాలుగా చిరుతపులి ఇప్పటి వరకు 67 జీవాలను హతమార్చింది. దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా 67 జీవాలను హతమార్చగా అందులో మేకలు, లేగదూడలు, దూడ్డెలున్నాయి. పంట పొలాల వద్ద పశువుల పాకలో కట్టేసిన జీవాలే లక్ష్యంగా చంపుకుతింటుంది. ముఖ్యంగా మెదక్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, హవేళిఘణాపూర్ మండలాల్లో ఈ పులి వేట సాగుతోంది. ఇందులో ఒక్కో బాధితుడికి రూ. 1,500 నుంచి రూ. 2,000 వేల వరకు పరిహారం చెల్లించగా ఆవుదూడలు, దూడ్డెలకు రూ. 3వేల నుంచి 10వేల వరకు పరిహారాన్ని అటవీ అధికారులు చెల్లించారు. ప్రతి యేటా అటవీ అభివృద్ధికి వచ్చే బడ్జెట్లో సగం చిరుతపులి చంపుకుతినే జీవాల బాధితులకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. మృతి చందిన వాటిలో ఇప్పటి వరకు 62 జీవాలకు పరిహారం చెల్లించగా, మరో ఐదింటికి చెల్లించాల్సి ఉంది. చిరుతను బంధించేందుకు గతేడాదిగా ఫారెస్ట్ అధికారులు చేయని ప్రయత్నం లేదు. పులులను బంధించే నిష్ణాతులైన శిక్షణ పొందిన వారిని హైదరాబాద్ నుంచి రప్పించి రామాయంపేట అడవుల్లో అనేక చోట్ల బోన్లను సైతం ఏర్పాటు చేశారు. దానికి మేకలు, దూడలను ఎరవేసినప్పటికీ ఆ పులి అటవీ అధికారుల కళ్లుగప్పి తిరుగి బోనుకు చిక్కని పరిస్థితి. రెండు నెలలుగా స్తబ్దుగా ఉన్న చిరుత ఇటీవల మళ్లీ రెచ్చిపోయి వేట మొదలుపెట్టింది. ఇటీవల చిన్నశంకరంపేట మండలంలోని కొండాపూర్‌లో పశువుల మందపై దాడి చేసి దూడెను ఎత్తుకెళ్లింది. ఇలా నిత్యం 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని అడవుల్లో ఈ చిరుత సంచరిస్తుందని తెలుస్తోంది. గుర్తించిన అధికారులు దాన్ని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒంటరి జీవాలే టార్గెట్.. బోరుబావులు, పంటపొలాల వద్ద ఒంటరిగా కట్టేసే లేగదూడలు, మేకలు ఆవుదూడలను చంపుకుతింటుంది. ఎక్కువ శాతం ఊరికి చివరలోని పంటపొలాల్లో కట్టేసినవాటినే టార్గెట్ చేస్తోంది. కానీ ఇప్పటి వరకు గ్రామాల్లో చొరబడి జీవాలను చంపిన దాఖాలాలు లేవు. కాగా రైతులు నిత్యం పంటపొలాల వద్దే ఎక్కువ సమయం గడుపుతున్నందున వారు పాడిపశువులను అక్కడే కట్టేస్తారు. ఈ క్రమంలో పులి వాటిని వెంటాడి చంపుతుండడంతో ఒంటరిగా పంటపొలాల వద్దకు వెళ్లాలంటేనే బాధిత మండలాల రైతులు జంకుతున్నారు. ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం.. చిరుతపులి ఎక్కువగా ఊరు బయట కట్టేసిన జీవాలపై మాత్రమే దాడి చేసి చంపుకుతింటుంది. కాగా పశువులు, మేకలను ఊరి చివర కాకుండా గ్రామాల్లోనే కట్టేయాలి. ఇప్పటి వరకు చిరుత 67 జీవాలను చంపింది. 62 జీవాలకు రూ. 4.5లక్షల పరిహారం చెల్లించాం. చిరుతను పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. –పద్మజారాణి, అటవీ శాఖ జిల్లా అధికారి -
నేపాల్‌లో బలైన మూగ జీవులు
నేపాల్: ప్రకృతి విలయం దెబ్బకు ప్రాణాలు కోల్పోయిన పశువులు కావివి. మానవుని అనాగరిక నమ్మకాలకు బలైపోయిన మూగ జీవులు. శుక్రవారం నేపాల్‌లోని బారా జిల్లాలో ఐదేళ్లకోసారి జరిగే ‘గడిమాయ్ పర్వ్’ ఉత్సవంలో భాగంగా ఇలా వేలాది జంతువులను బలి ఇచ్చారు. జంతు బలితో మంచి జరుగుతుందని నమ్మి ఏటా దాదాపు ఐదు లక్షల జంతువులను ఇలా చంపేయడం ఇక్కడి ఆచారం. ఇంతటి భారీ స్థాయిలో జంతు బలులు జరిగే వేడుక ప్రపంచంలో మరోటి లేదు. -
భాషణం: ‘ఇప్పుడే వచ్చేస్తాను’ అని వెళ్లిపోతే?
మనుషులకు, మూగజీవులకు మధ్య ఉండేది జీవవైవిధ్యంలాంటి స్నేహం. అందుకేనేమో తరచు వాటి స్వభావాలను మనుషులకూ అన్వయించి మాట్లాడుతుంటాం. monkey business అనే మాట ఇలాంటి అన్వయమే. అల్లరిచిల్లరి వ్యవహారాన్ని, అంగీకారయోగ్యం కాని ప్రవర్తననీ ‘మంకీ బిజినెస్’ అంటారు. The teacher suspected that there had been some monkey business going on in the class. Dog అనే మాటతో అయితే ఇలాంటివి సవాలక్ష ఉన్నాయి. dog eat dog (స్వార్థం కోసం దేనికైనా వెనకాడని లోకమిది అని చెప్పడం), put on the dog (మన గురించి మనం గొప్పగా భావించుకుని అలా ప్రవర్తించడం, మనకంత సీన్ లేకపోయినా), every dog has its day (ప్రతి ఒక్కరికీ ఒక మంచిరోజు వస్తుందని చెప్పడం), give a dog a bad name (కొత్త ఆరోపణను మోపడానికి పాత తప్పును ఎత్తిచూపడం. ‘కుక్కను కొట్టి చంపాలంటే ముందుగా అది పిచ్చిదని ప్రచారం చేయాలి’ అనే అర్థంలో ఈ మాట మన వాడుకలో ఉంది), why keep a dog and bark yourself? (పనివాణ్ణి పెట్టుకుని కూడా మళ్లీ నువ్వే ఆ పని చేసుకోవడం ఎందుకు అని ప్రశ్నించడం), you can't teach an old dog new tricks (అలవాట్లను ఒక పట్టాన మార్చలేమని చెప్పడం), the hair of the dog (రాత్రి తాగిన మందు ఎక్కువై ఉదయాన్నే తలంతా భారంగా ఉండి, మోకాళ్లు గుంజేస్తుంటే ఆ బాధను తగ్గించుకోడానికి మళ్లీ సేవించే పిసరంత మద్యమే... ది హెయిర్ ఆఫ్ ది డాగ్), love me, love my dog (నన్ను ఇష్టపడితే నాలోని లోపాలను కూడా ఇష్టపడాలి అని చెప్పడం), see a man about a dog (ఎక్కడికి వెళుతున్నదీ, ఎందుకు వెళుతున్నదీ చెప్పకుండా ‘ఇప్పుడే వచ్చేస్తాను’ అని చెప్పడం. ఉదా: టాయ్‌లెట్‌కు వెళ్లవలసి వస్తే I have just got to see a man about a dog. I will be back in a minute అనొచ్చు), sick as a dog (విపరీతంగా వాంతి అయితే ఇలా అంటారు), tail wagging the dog (కుక్క... తోకని కాకుండా, తోకే కుక్కని ఊపుతుందని చెప్పడం. చెప్పిన మాట వినకుండా పిల్లలు పెద్దవాళ్లను ఒక ఆట ఆడిస్తున్నా కూడా అది టెయిల్ వ్యాగింగ్ ది డాగ్ కిందికే వస్తుంది), work like a dog (ఒళ్లు హూనమయ్యేలా పనిచేయడం). A dog in the manger అంటే గడ్డివాములో కుక్కతంతు. తను తినదు, తినడానికి వచ్చే గేదెల్ని తిననివ్వదు. మనుషుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉంటారు. వాళ్లు ప్రయోజనం పొందరు. పొందేవాళ్లను పొందనివ్వరు. manger అంటే పశువులకోసం దాణా వేసి ఉంచే పెట్టె. దీనిని ‘మేంజర్’ అని పలకాలి.కోతులు, కుక్కలు కొంతవరకు అయ్యాయి కనుక ఇప్పుడు పులులు, సింహాల దగ్గరి వెళ్దాం. Beard the lion అనే ఒక మాట ఉంది. సింహం గుహలోకి వెళ్లి జూలు పట్టి లాగడం లాంటిదిది. ముఖ్యమైన స్థానంలోని వ్యక్తులను నేరుగా వారున్న చోటికే వెళ్లి కలిసి, వారికి నచ్చని విషయం గురించి మాట్లాడడాన్ని beard the lion (in his / her den) అంటారు. ఇక్కడ beard అంటే గడ్డం కాదు, సంద ర్శించడం. ఇలాంటి దుస్సాహసాన్ని lion-hearted పీపుల్ మాత్రమే చేయగలరు. లయన్ హార్టెడ్ అంటే మాంచి ధైర్యస్థులని. ఇక tiger దగ్గరికి వద్దాం. ఈ పదంతో ఇంగ్లిషులో పెద్దగా ఎక్స్ప్రెషన్స్ లేవు. Paper tiger అనే మాట మాత్రం తరచు వినిపిస్తుంటుంది. కాగితం పులి అని దీని అర్థం. పైకి గంభీరంగా, ప్రమాదకరంగా కనిపిస్తూ లోపల మామూలుగా ఉండే మనుషులను, దేశాలను ఉద్దేశించి ఇలా అంటారు. ప్రధానంగా దీనిని నెగటివ్ సెన్స్‌లో వాడతారు. Work like a dog అనే మాట ఉన్నట్లే... do (all) the donkey work అనే పలుకుబడి ఉంది. దీనర్థం బోరింగ్ జాబ్ అని. అలాగే S talk the hind leg(s) off a donkey అంటే... తెరిపిలేకుండా అదే పనిగా వాగుతుండడం. hind legs అంటే వెనక కాళ్లు. hind ని ‘హైండ్’ అని పలకాలి. ఇంతకీ వాగుడుకి, గాడిద వెనక కాళ్లకీ సంబంధం ఏమిటి? అసలీ వ్యక్తీకరణ ఎలా పుట్టుకొచ్చింది? స్పష్టమైన ఆధారాల్లేవు. గాడిదలు సాధారణంగా వెనక కాళ్లపై కూర్చోవు. వాటిని అలా కూర్చోబెట్టడానికి తల ప్రాణం తోకకు వస్తుందట. గంటల తరబడి గాడిద వెనక కూర్చొని వాటి కాళ్లను క న్విన్స్ చెయ్యాలన్న వ్యంగ్యార్థంలోంచి ఈ ఫ్రేజ్ వచ్చిందని చెబుతారు. ఎవరినైనా, ఏ విషయంలోనైనా ఒప్పించడానికి అదేపనిగా వాళ్ల చెవులను వాయగొట్టడాన్ని ‘టాక్ ది హైండ్ లెగ్స్ ఆఫ్ ఎ డాంకీ’ అనడం ఇందుకేనేమో. Donkey years అనే మాట కూడా ఇలాగే వచ్చి ఉండాలి. దీర్ఘకాలం అనే అర్థంలో. అయితే అవి years కాదు, ears అనే భాషావేత్తలూ ఉన్నారు. ears కాలక్రమంలో years అయ్యాయని ఇంకో అభిప్రాయం.